
విద్యుత్ స్తంభంపై మంటలు
జయపురం: కొరాపుట్ జిల్లా సెమిలిగుడ – నందపూర్ మార్గంలో ఒక విద్యుత్ స్తంభంపై బుధవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే విద్యుత్ విభాగ ఎస్‌డీవోకు సమాచారం అందజేశారు. విద్యుత్ సిబ్బంది స్పందించి సరఫరాను నిలిపివేశారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సునాబెడ ఎస్డీవో గోపాల కృష్ణ ప్రధాన్ మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
షడ్భుజ గౌరంగ రూపం
పవిత్ర వైశాఖ కృష్ణ పక్షం ప్రతిపాద తిథి పురస్కరించుకుని పూరీ శ్రీజగన్నాథుని ప్రతినిథి మదన మోహనుడు షడ్భుజ గౌరంగ రూపంలో దర్శనమిచ్చాడు. స్వామి వెలుపలి చందన యాత్రలో భాగంగా 13వ రోజున నరేంద్ర పుష్కరిణి చందన మండపంపై ఈ అలంకారంలో స్వామి నవకాంతులు వెదజల్లాడని భక్తులు మురిసిపోయారు. – భువనేశ్వర్

విద్యుత్ స్తంభంపై మంటలు