
ఎస్‌ఈబీసీ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకటన
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ మాఝి ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాల్లో ఎస్‌ఈబీసీ విద్యార్థులకు 11.25 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు. బుధవారం ఆయన అధ్యక్షతన జరి గిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో ప్రవేశా ల్లో సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఎస్‌ఈబీసీ) విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది. ఈ నిర్ణయంతో ఎస్‌ఈబీసీ కేటగిరీ విద్యార్థు లు ప్రవేశాల్లో 11.25 శాతం సీట్ల రిజర్వేషన్ పొందుతారు. ఈ విధానం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబడుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మంత్రి మండలి తాజా తీర్మానంతో విద్యా సంస్థల్లో సమగ్ర రిజర్వేషను పరిమితి 56 శాతానికి చేరింది.

ఎస్‌ఈబీసీ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకటన