
ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న తహసీల్దార్
కొత్తూరు: పొనుటూరు గ్రామంలోని వంశధార నది నుంచి ఒడిశాకు అక్ర మంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సోమవారం స్థానిక తహసీల్దార్ కె.బాలకృష్ణ పట్టుకున్నారు. ఇక్కడ అక్రమాలపై ‘దేవుడి పేరుతో దోపిడీ’ పేరిట సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనికి తహసీల్దార్ స్పందించారు. పొనుటూరు నుంచి ఒడిశాకు వెళ్తున్న రెండు ఇసుక ట్రాక్టర్‌లను పొనుటూరు–రుగడ రోడ్డులో పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.పది వేలు చొప్పున అపరాధ రుసుం విధించారు. మరోసారి దొరికితే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని తెలిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.

ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న తహసీల్దార్