
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్ కోట్ పట్టణం సమీపంలోని బుర్జా జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎదురుగా వస్తున్న బైక్‌ను వ్యాన్ ఢీ కొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో సందస గ్రామానికి చెందిన పర్షు గౌడ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన మరో ఇద్దరిని ఉమ్మర్ కొట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఉమ్మర్ కోట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరి పరిస్థితి విషమం

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి