
లింగరాజ్ ఆలయంలో విదేశీ పర్యాటకుడు
భువనేశ్వర్: ఏకామ్ర క్షేత్రం లింగరాజ్ ఆలయంలో ఒక విదేశీ పర్యాటకుడు ఫొటోలు తీస్తూ కనిపించాడు. అతడిని రొమేనియాకు చెందిన వాసిలాచే ఆండ్రీ క్రిస్టియన్‌గా గుర్తించారు. శుక్రవారం చోటు చేసుకున్న ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఆలయ ప్రాంగణం అచ్యుత కహాండ ప్రాంతంలో అతని అనుమానాస్పద ప్రవర్తనను గమనించిన ఆలయ పోలీసులు, సేవకులు అతడిని ప్రశ్నించారు. వెంటనే అతడిని ఆలయం నుంచి ఆలయ కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ విచారణలో అతడు క్రైస్తవ మతస్తుడిగా గుర్తించారు. విదేశీ పర్యాటకుడిని అదుపులోకి తీసుకుని పత్రాలు, పాస్‌పోర్ట్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
హిందుయేతరులు ఆలయంలోకి ప్రవేశించడం నిషిద్ధం. విదేశీయుడు ఆలయంలోకి ప్రవేశించడంతో ఆలయ ఆచారాలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం ఆలయాన్ని సున్నపు నీటితో శుద్ధి చేశారు. దీంతో రోజువారీ పూజలు దాదాపు మూడున్నర గంటలు ఆలస్యమయ్యాయి. ఈ సందర్భంగా లింగరాజు మహా ప్రభువు కోసం తయారు చేసిన ప్రసాదం అపవిత్రమైనట్లు ప్రకటించి ‘అముణియా’ కొలనులో వేశారు. మూల విరాట్‌ను కూడా మహా స్నానం చేయించి మరోసారి అలంకరించారు.
ఈ సంఘటన ఆలయ సేవకులలో, అధికారులలో తీవ్ర కలకలం రేపింది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సేవకులు డిమాండ్ చేశారు. 2012 సంవత్సరంలో రష్యన్లు హిందూ మతంలోకి మారినట్లు చెప్పుకున్న వ్యక్తి లింగరాజ్ ఆలయం లోనికి ప్రవేశించడంతో ఇలాంటి గందరగోళ పరిస్థితి నెలకొంది. అంతకు ముందు 2009 సంవత్సరం మార్చి నెలలో జరిగిన మరో సంఘటనలో పోలండ్‌కు చెందిన హిందూ ఎన్నారై బాలుడు రిస్జార్డ్ అంకుర్ అహుజా విదేశీయుడిలా కనిపించడంతో లింగరాజ్ ఆలయంలోకి ప్రవేశించకుండా ఆపారు.
ఆచారాలకు విఘాతం