బృందావన ప్యాలెస్‌లో చోరీ
పర్లాకిమిడి: మహేంద్రతనయ నడి ఒడ్డున ఉన్న బృందావన ప్యాలెస్‌లో స్వాగత ద్వారం వద్ద మెట్లకు ఉన్న ఐరన్ రెయిలింగ్‌ను దుండగులు దొంగిలించారు. దీనిపై పర్లాకిమిడి ఆదర్శ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 148 ఏళ్ల కిందట మైసూర్ నుంచి తీసుకువచ్చి బీఎన్ ప్యాలస్ మెట్లకు ఐరన్ రెయిలింగ్ ఏర్పాటుచేశారు. స్వర్గీయ పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి వేసవి విడిదికి ఈ బృందావన్ ప్యాలస్‌ను నిర్మించారు. ఇక్కడే బ్రిటిష్ పాలకులకు విందులు, సమావేశాలు జరిపేవారట. తదనంతరం కృష్ణచంద్రగజపతి నారాయణదేవ్ కుమారుడు రామచంద్రగజపతి కొన్నాళ్లు వేసవి విడిది చేశేవారు. తదనంతరం గజపతి జిల్లాలో ఆంధ్రా ఒడిషా రాష్ట్రాల సరిహద్దు శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం పట్టుపురంలో ఒక జమీందారును పీపుల్స్‌వార్ గ్రూప్ దళం తలను నరికి చంపింది. ఈ సంఘటన అనంతరం సీఆర్పీఎఫ్ జవాన్లను కేంద్రం మోహరించింది. ఆ సమయంలో ప్యాలెస్‌లో విలువైన ఫౌంటైన్‌లు, విదేశాల నుంచి తీసుకువచ్చిన టైల్స్, పాలరాతి బొమ్మలు మాయమయ్యాయి. ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం బీఎన్ ప్యాలెస్‌ను సంరక్షించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
బృందావన ప్యాలెస్‌లో చోరీ


