
18 కేజీల గంజాయి పట్టివేత
కాశీబుగ్గ : పలాస రైల్వేస్టేషన్‌లో బుధవారం రాత్రి 18 కేజీల 550 గ్రాముల గంజాయితో ఓ వ్యక్తి పట్టుబడినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. గురువారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. సుజిత్ సూర్జియా అనే వ్యక్తి గుణుపూర్ నుంచి పలాస మీదుగా బరంపురం వెళ్లే ఉమా ఎక్స్‌ప్రెక్స్ బస్సుకు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసయ్యాడు. పర్లాకిమిడికి చెందిన పుస్కో పొరిచా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పొరిచా తాను ఇచ్చే గంజాయిని ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేయమని సుజిత్ కు చెప్పగా అందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో మహారాష్ట్రకు 18.550 కేజీల గంజాయిని తరలిస్తుండగా పలాసలో కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ, సిబ్బంది పట్టుకున్నారు. సుజిత్‌తో వచ్చిన మరో ఇద్దరు పరారయ్యారు.