
ఎయిడ్స్ మృతులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ
అరసవల్లి: అంతర్జాతీయ ఎయిడ్స్ స్మారక దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా వైద్యారోగ్యశాఖకార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.అనిత ఆధ్వర్యంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నివారణాధికారి డాక్టర్ టి.శ్రీకాంత్ సమక్షంలో ఎయిడ్స్ మృతులను స్మరించుకుంటూ కొవ్వొత్తులను వెలిగించి నివాళులు అర్పించారు. ‘ఎయిడ్స్‌తో చనిపోయిన వారిని గుర్తుంచుకుంటాం.. మేం మాట్లాడతాం..మేం నడిపిస్తాం..’ అంటూ నినాదాలు చేశారు.కార్యక్రమంలో ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్ సీహెచ్,అప్పలనాయుడు, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పి.మోహిని, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ ఆదిలింగం, సామాజికవేత్త వెంకటస్వామి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.