చెలరేగిపోతున్న.. మట్టి మాఫియా | - | Sakshi
Sakshi News home page

చెలరేగిపోతున్న.. మట్టి మాఫియా

May 19 2025 4:07 PM | Updated on May 19 2025 4:07 PM

చెలరే

చెలరేగిపోతున్న.. మట్టి మాఫియా

చెరువును కప్పేస్తున్నారు..

సంతబొమ్మాళి: అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే వాటికి వంత పాడుతుండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. సంత బొమ్మాళి మండల ఉపాధి ఏపీవో పంగ నరసింహమూర్తి స్వగ్రామైన చెట్లతాండ్ర గ్రామంలో ఉపాధి పనులు జరుగుతున్న పెద్ద చెరువును కప్పేస్తున్నారు. టాక్టర్ల ద్వారా మట్టిని తరలించి పూర్తిగా కప్పేస్తున్నారు. ఈ చెరువులో నీరు పంట భూములకు ఎంతగానో ఆసరాగా నిలిచేదని, ఇప్పుడు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబధనలకు విరుద్ధంగా చెరువులో పనులు జరుగుతున్నా ఏపీవో పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు తప్పుపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇచ్చాపురం రూరల్‌: ఒకప్పుడు మండలంలో ఎటు చూసినా పచ్చని పంట పొలాలు..చెట్లు, గుట్టలతో ఆహ్లాదరక వాతావరణ దర్శనమిచ్చేది. ప్రస్తుతం కొంతమంది బడా నాయకులు పంట పొలాలు చదును పేరుతో అక్రమ మార్గంలో మట్టి దందా జోరుగా సాగిస్తున్నారు. మట్టిని తరలించి అందినకాడికి దండుకుంటున్నారు. దీనిని అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి, కేశుపురం, హరిపురం, కొళిగాం, ధర్మపురం, తులసిగాం, లొద్దపుట్టి, ఈదుపురం, అరకబద్ర, మశాఖపురం, బిర్లంగి, మండపల్లి పంచాయతీ తదితర ప్రాంతాల్లో గట్టు చప్పుడు కాకుండా పంట భూములను తవ్వేసి దర్జాగా ఇటుక బట్టీలు, ప్లాట్లకు వేసుకుంటున్నారు. తేలుకుంచి తదితర గ్రామాల పరిధిలో దేవదాయ శాఖ భూములను సైతం అక్రమార్కులు వదలడం లేదు.

అనుమతులేవీ..?

పచ్చని పంట పొలాల్లో పాగా వేసి నాలా కన్వర్షన్‌ చేసుకోకుండా, స్థానిక సంస్థలతో అనుమతులు తీసుకోకుండా కొందరు మట్టి తవ్వకాలు చేపడుతూ ప్లాట్లు వేస్తున్నారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించాలంటే తొలుత ఆ భూమిని తహసీల్దార్‌ కార్యాలయంలో వ్యవసాయేతర భూమిగా (నాలా కన్వర్షన్‌) చేసుకోవాలి. మండలంలో ప్రస్తుతం అవేమీ కనిపించడం లేదు. మండలంలో సుమారు పాతిక వరకు ఇటుక బట్టీలు ఉన్నాయి. వీటి కోసం జేసీబీ వాహనాలు ఉన్న యజమానులు ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.

చర్యలు తప్పవు..

సొంత పొలాల్లో సైతం మట్టి తవ్వకాలు జరపడం చట్ట విరుద్ధం. మైనింగ్‌ శాఖాధికారుల పర్మిషన్‌ తీసుకోవాల్సిందే. దేవదాయ భూముల్లో మట్టి తవ్వకాలు జరిపితే ఎండోమెంట్‌ శాఖాధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాలి. పంట పొలాల్లో నాలా కన్వర్షన్‌ లేకుండా ప్లాట్లు వేస్తే కఠిన చర్యలు తప్పవు.

– ఎన్‌.వెంకటరావు, ఇచ్ఛాపురం తహసీల్దార్‌

అనుమతులు లేకుండా జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలింపు

ఇటుక బట్టీలు, ప్లాట్లకు అమ్మకాలు

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

పట్టించుకోని అధికార యంత్రాంగం

చెలరేగిపోతున్న.. మట్టి మాఫియా 1
1/3

చెలరేగిపోతున్న.. మట్టి మాఫియా

చెలరేగిపోతున్న.. మట్టి మాఫియా 2
2/3

చెలరేగిపోతున్న.. మట్టి మాఫియా

చెలరేగిపోతున్న.. మట్టి మాఫియా 3
3/3

చెలరేగిపోతున్న.. మట్టి మాఫియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement