
అతిపిన్న వయసులోనే ప్రధాన మంత్రి పదవిని అధిష్ఠించిన రాజీవ్ గాంధీ (Rajiv Gandhi)దేశ భవిష్యత్తుకు నాడు నాటిన అభివృద్ధి మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయి. ఆయన దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ సరళీకృతం చేయడం, పరిశ్రమలకు రాయితీలు, పంచా యతీ రాజ్ వ్యవస్థ పటిష్ఠత వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 21వ శతాబ్దిలో దేశాన్ని నూతన పథంలో నడిపించేలా దిశానిర్దేశం చేశారు. ఆయన యువతరంలో శక్తిమంతమైన మార్పును ఆకాక్షించి కంప్యూటర్ యుగానికి నాంది పలకడంతో ఇప్పుడు దేశం ప్రVýæతి దిశలో పయనిస్తోంది. నాటి ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ ముష్కరుల చేతిలో హత్యకు గురవడంతో దేశ ప్రజల ఆకాంక్ష, ఒత్తిడి మేరకు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్ 31న భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984 డిసెంబర్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో 414 స్థానాలు గెలిచింది. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలనే ప్రధానలక్ష్యంతో ‘పబ్లిక్ కాల్ ఆఫీస్’ (పీసీఓ) విధానాన్ని ప్రవేశ పెట్టడంతో సాధారణ ప్రజలకు కూడా కమ్యూనికేషన్ కనెక్ట విటీ పెరిగింది. రాజీవ్ ప్రభుత్వం అత్యాధునిక టెలి కమ్యూ నికేషన్ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేయడానికి 1984లో ‘సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్’ స్థాపించింది. 1985లో విద్యను సార్వత్రికీకరించడానికి‘ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ’ని ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఓపెన్ యూనివర్సి టీల ప్రారంభానికి ఇది స్ఫూర్తిగా నిలిచింది. బడుగు, బల హీన వర్గాలకు ప్రయోజనం కలిగేలా జాతీయ విద్యా విధా నాన్ని విస్తరించాలనే లక్ష్యంతో
1986లో రాజీవ్ గాంధీ దేశంలో ‘జవహర్ నవోదయ విద్యాలయాల’ను ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకున్నారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1989 మే 15వ తేదీన చేసిన 64వరాజ్యాంగ సవరణకు అనుగుణంగా పీవీ నరసింహారావు ప్రభుత్వం 1993లో చేసిన 73వ రాజ్యాంగ సవరణతోపంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది. మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే తలంపుతో రాజీవ్ గాంధీ 1985లో దీనికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి పీవీ నరసింహారావుకు అప్పగించారు. దేశ రాజకీయాల్లో ముఖ్యంగా 1967 తర్వాత పార్టీ ఫిరాయింపులు ఎక్కువవడంతో వాటి కట్టడికి రాజీవ్ నడుం కట్టారు.
1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘పార్టీ ఫిరా యింపుల నిరోధక చట్టా’న్ని 10వ షెడ్యూల్‌లో చేర్చడంతో పార్టీలు మారే ప్రజాప్రతినిధుల సభ్యత్వాన్ని రద్దు చేసే అవ కాశం ఏర్పడింది. రాజీవ్ గాంధీ చేసిన చరిత్రాత్మక చట్టాల్లో 61వరాజ్యాంగ సవరణ బిల్లు కీలకమైంది. దేశ నిర్మాణంలో యువతను భాగస్వాములుగా మార్చాలనే ఉన్నతమైన ఆశ యంతో ఈ చట్ట సవరణ ద్వారా ఓటు వేసే కనీస వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు.దీంతో దేశ రాజకీయాల్లో యువత ప్రాధాన్యం పెరగడమే కాకుండా వారు తమ ఆశయాలకు అనుగుణంగా ప్రజాప్రతి నిధులను ఎన్నుకునే అవకాశాలు ఏర్పడ్డాయి.రాజీవ్ గాంధీ 1991లో ఎన్నికల ప్రచారంలో హడా విడిగా ఉన్న సమయంలో మే 21 రాత్రి కాళరాత్రిగామారింది. శ్రీపెరంబుదూర్‌లో ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం’ ఆత్మాహుతి దళం బాంబర్ బెల్టు దాడిలో రాజీవ్‌గాంధీ మరణించారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు ఈ దుర్ఘటన షాక్ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్ప టికీ ఆ విషాదాన్ని తలుచుకుంటే దుఃఖం ఆగదు.
రాజీవ్ గాంధీని ఉగ్రవాదులు హతమార్చిన మే 21వ తేదీని భారత దేశంలో ప్రతి ఏటా ‘ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం’గా పాటిస్తున్నారు. భారత్‌లో సాంకేతిక విప్లవానికి ఆద్యుడైన రాజీవ్ గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు మనం ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్‌ను అనుసరిస్తున్నామంటే అందుకునాడు సాంకేతిక రంగానికి రాజీవ్ గాంధీ వేసిన బీజాలే కారణం. మరణానంతరం ఆయనకు దేశంలో ప్రతిష్ఠాత్మక మైన ‘భారతరత్న’ ప్రకటించారు. రాజీవ్ గాంధీ పేరున అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డు అందిస్తున్నారు. ‘మిస్టర్ క్లీన్’గా రాజకీయాల్లో ప్రవేశించిన రాజీవ్ గాంధీకి ప్రజాదరణ పెరగడంతో పాలు పోని ప్రతిపక్షాలు భోఫోర్స్ కేసు పేరుతో అసత్య ఆరోపణలు చేసినా అవి నిరూపితం కాకుండా ఫాల్స్ కేసులుగానే మిగిలి పోయాయి.
-బి. మహేశ్ కుమార్ గౌడ్
వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు
(నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి)