
శ్రీమందిరం భద్రతకు సరికొత్త వాహనం
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం భద్రత అనుక్షణం పటిష్టపరుస్తున్నారు. ఈ వ్యవస్థని అధునాతన సరంజామాతో విస్తరించే ప్రయత్నంలో భద్రతా విభాగం తలమునకలై ఉంది. ప్రసిద్ధ శ్రీజగన్నాథ ఆలయానికి భద్రతను పెంచారు. తాజా పరిస్థితుల దృష్ట్యా కమాండోలతో నిర్వహించే అత్యాధునిక రక్షణ వజ్ర వాహనం జోడించారు. ఆధునిక ఆయుధాలతో కూడిన ప్రత్యేక కమాండోలు దీనితో ప్రసిద్ధ ఆలయానికి రాత్రింబవళ్ళు 24 గంటల పాటు భద్రతను కల్పిస్తారు. అధునాతన ఆయుధాలతో సాయుధ కమాండోలను కూడా మోహరించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనను ఎదుర్కోవడానికి, యాత్రికులకు వారి భద్రత గురించి భరోసా కోసం ఈ చర్య దోహదపడుతుందన్నారు.