
ఉక్కుర పంచాయతీలో స్పందన
పర్లాకిమిడి: జిల్లాలో గుమ్మాబ్లాక్ ఉక్కుర పంచాయతీ కార్యాలయంలో గ్రామ పరిపాలన, స్పందన కార్యక్రమానికి కలెక్టర్ బిజయ కుమార్ దాస్ విచ్చేశారు. సోమవారం ప్రభుత్వ సెలవు కారణంగా మంగళవారం గ్రీవెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ జ్యోతేంద్ర కుమార్ పండా, జిల్లా పరిషత్ సీడీఎం శంకర కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. తరబ, ఉక్కుర, గైబ, గుమ్మా పంచాయతీల నుంచి 74 వినతులు అందగా, వాటిలో గ్రామసమస్యలు 42, వ్యక్తిగతం 32 ఉన్నాయి. వాటిలో నలుగురు నిస్సహాయులకు రూ.10వేలు చొప్పున రెడ్ క్రాస్ సహాయనిధి నుంచి కలెక్టర్ ఆర్థిక సాయం అందజేశారు. ఈ గ్రీవెన్సులో గుమ్మా సమితి అధ్యక్షురాలు సునేమీ మండళ్, సి.డి.యం.ఓ. డా.యం.యం.ఆలీ తదితరులు పాల్గొన్నారు.

ఉక్కుర పంచాయతీలో స్పందన