పరాక్రమ విజయ దివస్ ర్యాలీ
పర్లాకిమిడి: ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత భారత సేనలకు అభినందనలు తెలియజేస్తూ గజపతి జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా పాలనాధికారి బిజయ కుమార్ దాస్ ‘పరాక్రమ విజయ దివస్’ పేరిట గురువారం సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం నిర్వహించిన ర్యాలీలో ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి హైస్కూల్ జంక్షన్, మార్కెట్, పాతబస్టాండు, కొత్త బస్టాండు, ప్యాలెస్ మీదుగా ఫారెస్టు కార్యాలయం వరకూ ఈ మోటారు సైకిల్ ర్యాలీ జరిగింది. ఈ పరాక్రమ విజయ దివస్ ర్యాలీలో ఏడీఎం ఫాల్గుణ మఝి, ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో, సబ్ కలెక్టర్ అనుప్ పండా, పురపాలక అధికారి లక్ష్మణ ముర్ము, తహసీల్దార్ నారాయణ బెహారా, డీసీపీయూ అరుణ్‌కుమార్ త్రిపాఠి, జిల్లా క్రీడా కోఆర్డినేటర్ సురేంద్ర పాత్రో తదితరులు పాల్గొన్నారు.
రాయగడ: ఆపరేషన్ సిందూర్ విజయవంతమవ్వడంతో పట్టణంలొ గురువారం జిల్లా యంత్రాంగం నిర్వహించిన పరాక్రమ యాత్రలో భాగంగా నిర్వహించిన బైకు ర్యాలీలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ పరూల్ పట్వారి కలెక్టర్ కార్యాలయం ఎదుట జెండా ఊపి ఈ కార్యక్రమానికి శుభారంభాన్ని పలికారు. అనంతరం బైకు ర్యాలీ పట్టణంలో గల సమితి కార్యాలయం మీదుగా రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి యూటర్న్ తీసుకుని మెయిన్ రోడ్డు మీదుగా స్థానిక గాంధీపార్క్ వరకు కొనసాగింది. ర్యాలీలొ సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా పాల్గొన్నారు.
జయపురం: దేశ సమైక్యత, సంఘీభావానికి గురువారం జయపురంలో మునిసిపాలిటీ నేతత్వంలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పరాక్రమ శోభాయాత్ర అద్దం పట్టింది. మన దేశ రక్షణలో తామంతా ముందుంటామని ప్రజలు నినాదాలు చేశారు. వేలాది ప్రజలతో నిర్వహించిన బైక్ ర్యాలీని ఒడిశా ఆర్థిక మంత్రి సురేష్ పూజారి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గోండ్, కామర్ష్ , ట్రాన్స్‌పోర్ట్, స్టీల్, మైనింగ్ మంత్రి భిభుతి భూషణ జెన, ఫిషరీష్, యానిమల్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్, మైక్రో, స్మాల్ అండ్ మీడియమ్ ఎంటర్‌ప్రీనియర్స్ మంత్రి గోకులానంద మల్లిక్‌లు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ పరాక్రమ శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. నెక్షా షోరూం బరిణిపుట్ నుంచి బయలు దేరిన శోభాయత్ర పట్టణంలో ప్రధాన రహదారుల మీదుగా విక్రమవిశ్వవిద్యాలయం క్రీడా మైదానం చేరుకుంది. విశ్వవిద్యాలయ మైదానంలో జరిగిన సభలో రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి వీర సైనికులకు నివాళులర్పించేందుకు శోభాయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాసన్, జయపురం సబ్ కలెక్టర్ అక్కవర శొశ్యా రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమర్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
మల్కన్‌గిరి : మల్కన్‌గిరిలో గురువారం స్థానిక బిజూ పట్నాయిక్ ఇండోర్ స్టేడియం నుంచి డీఎన్‌కే క్రీడా మైదానం వరకు త్రివర్ణ యాత్ర నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ త్రివర్ణ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. 200 మీటర్ల జాతీయ జెండాతో త్రివర్ణ యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి డిఐపిఆర్‌ఓ ప్రమిళా మాఝి తదితరులు పాల్గొన్నారు.
పరాక్రమ విజయ దివస్ ర్యాలీ
పరాక్రమ విజయ దివస్ ర్యాలీ


