
ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం
రాయగడ: ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఓపీసీసీ) నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సాధారణ కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ శనివారం ప్రకటించారు. ఓపీసీసీ కోశాధికారిగా సిద్దార్థ్ స్వరూప్ దాస్, ఉపాధ్యక్షులుగా తారాప్రసాద్ బాహిణీపతి, రమేష్ జెన్నా, సంతక్షష్ సింగ్ సాలూజా, దేవాశీష్ పట్నాయక్, సీఎస్ రజీన ఎక్కా, లలటుందు మహాపాత్రొ, సస్మిత బెహరాలు నియమితులయ్యారు. సాధారణ కార్యదర్శులుగా అశోక్ దాస్, అప్పలస్వామి కడ్రక, ప్రఫుల్ల ప్రధాన్, మంగూ ఖిల్లా, పవిత్ర సావుంత, నీలమాధవ హికక, సువర్ణ నాయక్, సయ్యద్ యాషిర్ నవాజ్, బిజయానంద చవులియ, మధుస్మిత శెఠి, కార్యదర్శులుగా తులేశ్వర్ నాయక్, సస్మిత పండా, శిల్పశ్రీ హరిచందన్, దేవాష్‌మ్రిత శర్మ, లక్ష్మీధర్ సింగ్, దిలీప్ దురియా, రూపక్ తురుక్, సింహాచల్ గిరి ఉలక, మానిషా త్రిపాఠి, సక్కా సుజిత్, మోహన్ హేంబ్రమ్, అనిమా మింజ్‌లు నియమితులయ్యారు. ఓపీసీసీ అధ్యక్షుడిగా ఇదివరకే భక్తచరణ్ దాస్ నియమితులైన విషయం తెలిసిందే.
ప్రసాదం పవిత్రతను కాపాడాలి
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని అన్న ప్రసాదం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని శ్రీ మందిరం అధికార యంత్రాంగం పేర్కొంది. స్వామి దర్శనం తర్వాత ప్రధాన దేవస్థానం సముదాయం ఆనంద బజారు ప్రాంగణంలో కొనుగోలు చేసిన మహా ప్రసాదాన్ని నేలపై కూర్చుని తినడమే ఆచారంగా వస్తోందని స్పష్టం చేశారు. ఇటీవల స్థానిక హోటల్‌లో డైనింగ్ టేబుల్‌పై జగన్నాథుని మహా ప్రసాదం తింటున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
ఎస్‌ఈబీసీల అభివృద్ధికి కృషి
భువనేశ్వర్: వెనుకబడిన తరగతుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఎస్‌ఈబీసీ) విద్యార్థులకు 11.25 శాతం రిజర్వేషన్లను అమలు చేసినట్లు పేర్కొన్నారు. విద్యా రంగంలో వెనుకబడిన తరగతులకు విద్యాభ్యాసానికి వీలు కల్పించేందుకు రిజర్వేషన్లు అమలు చేసినందుకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సూరత్ బిస్వాల్ నేతృత్వంలో ఓబీసీ నాయకులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చారిత్రాక నిర్ణయం వల్ల వెనుకబడిన తరగతుల విద్యార్థులు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారని హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు సత్కారం
పర్లాకిమిడి: రాష్ట్ర సెకండరీ బోర్డు టెన్త్ పరీక్ష ఫలితాల్లో గజపతి జిల్లా వ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించిన ప్రజ్యోతి చౌదురి (566/600) విద్యార్థినీ, తండ్రి నిత్యానంద చౌదురి, తల్లి నమితా చౌదురికి ఎంబీడీ పబ్లిషర్స్ తరఫున శనివారం సత్కరించారు. అనంతరం ఎంబీడీ పబ్లికేషన్స్ 2025–26 విద్యాసంవంత్సరం శాంపిల్ టెక్ట్స్ పేపర్లను పలువురికి గంజాం, గజపతి, కంధమాల్ మార్కెటింగ్ మేనేజరు నిహార్ రంజన్ పండా అందజేశారు. కార్యక్రమంలో మహాంత రామానంద దాస్, సరస్వతీ శిశు మందిర్ ఆచార్యులు దుర్గాప్రసాద్ సాహు పాల్గొన్నారు.
13 అడుగుల కింగ్‌కోబ్రా పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంపీవీ 23 గ్రామంలోని ఓ టైర్లు మెకానిక్ షాప్‌లో 13 అడుగుల కింగ్‌కోబ్రా పాము స్థానికులను శనివారం భయపెట్టింది. షాప్ యజమాని సరోజిత్ కోయల్ పామును చూసిన వెంటనే కలిమెల స్నేక్ రిస్క్యూ వలంటీర్ రాకేష్‌కు సమాచారం ఇచ్చారు. ఆయనతోపాటు రాజేంద్రప్రసాద్ సాహు రెండు గంటలు శ్రమించి పామును పట్టుకున్నారు. దీని పొడవు 13 అడుగులు ఉండగా ఏడు కిలోల బరువు ఉంది. అనంతరం పామును ఎంఈ–12 గ్రామ అడవిలో వదిలేశారు

ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం

ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం