
రూ.కోట్లు వృథా.. తీరని వ్యధ!
● చుక్కనీరివ్వని కడగండి రిజర్వాయర్ ● రైతులకు తప్పని ఇక్కట్లు ● స్పందించని పాలకులు, అధికారులు
కడగండి జలాశయంకు కుడి, ఎడమ కాలువల నిర్మా ణం పూర్తయితే ఎల్.ఎన్.పేట, సరుబుజ్జిలి మండలా ల్లోని 580 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఎడమ కాలువ పరిధిలో ఎల్.ఎన్.పేట మండలం జంబాడ, వలసపాడు, బొర్రంపేట, ముంగెన్నపాడు, కరకవలస, మల్లికార్జునపురం, శ్యామలాపురం, కుశమల పాడు రెవెన్యూ గ్రామాల్లోని పంట భూములకు సాగునీరు అంతుంది. కుడి కాలువ పరిధిలో ఎల్.ఎన్.పేట మండలం వలసపాడు, బొర్రంపేట, జంబాడ, సరుబుజ్జిలి మండలంలోని గోనెపాడు, అమృతలింగానగరం, బప్పడాం, సరుబుజ్జిలి, కూనజమ్మన్నపేట తదితర గ్రామాలకు సాగునీరు అందుతుంది.
కడగండి రిజర్వాయర్
ఎల్.ఎన్.పేట :
కడగంటి జలాశయం.. రెండు మండలాల రైతుల చిరకాల స్వప్నం. ఈ జలాశయం నిర్మాణం పూర్తయి రెండు దశాబ్దాలు కావస్తున్నా కుడి, ఎడమ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో కళ్ల ఎదుటే నీరు వృథాగాపోతున్నా ఏమీ చేయలేని దయనీయ పరిస్థితిలో రైతులు ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పాలకులకు, అధికారులకు వేడుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకునే వారేరీ?
ఎల్.ఎన్.పేట మండలం జంబాడ–బొర్రంపేట గ్రామాల మధ్య కొండల మధ్య నుంచి కడగండి గెడ్డ ప్రవహిస్తుంటుంది. కొండల్లో కుండపోతగా వర్షం కురిస్తే కడగండి గెడ్డ వారం పాటు నిండుగా ప్రవహిస్తూ దిగువ ప్రాంతానికి వృథాగా వెళ్లిపోతుంది. ఈ నీటిని ఒడిసిపట్టి పంట పొలాలకు అందిస్తే వంద ల ఎకరాలు సశ్యశ్యామలం అవుతాయని, రెండు పంటలను పండించుకోవచ్చని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 జూలై 20న జలయజ్ఞంలో భాగంగా ‘నీటి పారుదల శాఖ ప్రత్యేక పరిశోధనా విభాగం, ఐఆర్‌డీఎఫ్–9’లో రూ.195.16 లక్షలు (సుమారు రూ.2కోట్లు) నిధులు మంజూరు చేశారు. 580 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 81 ఎకరాల్లో చేపట్టిన జలాశయం నిర్మాణం పనులు 2007 నాటికి పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువ నిర్మాణం కోసం 2008లో టెండర్లు పిలిచారు. భూసే కరణ చేయకపోవటంతో కాలువ పనులు నిలిచిపోయాయి. 2009లో వైఎస్సార్ మరణానంతరం రిజర్వాయర్‌ను పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు.
నిధులున్నా నిర్లక్ష్యం..
రిజర్వాయర్‌కు కుడి, ఎడమ కాలువల నిర్మాణంతో పాటు రైతుల వద్ద సేకరించి భూమికి పరిహారం చెల్లించాలని రైతులు అనేక ఫిర్యాదులు చేశారు. దీంతో గతంలో రూ.4.06 కోట్లు మంజూరు చేశారు. వీటిలో రూ.1.45కోట్లు భూసేకరణ కోసం, రూ.1.72 కోట్లు, కాలువల నిర్మాణం కోసం మిగిలిన నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. రిజర్వాయర్ లోపలి భాగంలో భూములు ముంపు బారిన పడుతున్నాయని, వాటిని ముంపు నుంచి తప్పించేందుకు గట్టు పెంచేందుకు రూ.89 లక్షలు ఖర్చు చేశారు. మిగిలిన పనులు గాలికి వదిలేశారు.
580 గ్రామాలకు సాగునీరు..
ఇప్పటికై నా స్పందించాలి..
కడగండి జలాశయం నిర్మా ణం పనులు పూర్తి చేసి 20 ఏళ్లవుతుంది. ఇప్పటి వరకు సెంటు భూమికి కూడా చుక్కనీరు అందలేదు. రిజర్వాయ ర్ నిండినా నీరు వృథాగా పోతుంది. దిగువన పంట భూములు నీట మునిగి రైతులు నష్ట పోతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి కాలువల పనులు పూర్తి చేయాలి.
– మామిడి నీలంనాయుడు, రైతు,
బొర్రంపేట, ఎల్.ఎన్.పేట

రూ.కోట్లు వృథా.. తీరని వ్యధ!

రూ.కోట్లు వృథా.. తీరని వ్యధ!