వీనులవిందుగా అన్నమయ్య కీర్తనల ఆలాపన
రాయగడ: అన్నమాచార్య సంకీర్తన మండలి ఆధ్వర్యంలో స్థానిక కోదండ రామ మందిర ప్రాంగణంలో సోమవారం సాయంత్రం అన్నమయ్య కీర్తనల ఆలాపన వీనులవిందుగా సాగింది. స్థానిక స్పందన సాహితీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు గుడ్ల గౌరి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన కూడా పలు కీర్తనలు పాడి అలరించారు. కార్యక్రమ నిర్వాహకురాలు పి.కల్యాణి, బి.అవంతి, జి.సులేఖ, ఎ.రమ్యశ్రీ, పి.గణపతి శాస్త్రి, కె.వర ప్రసాద్, గిరీష్ పట్నాయక్, తదితరులు అన్నమయ్య కీర్తనలు పాడి వినిపించారు. భళ్లమూడి నాగరాజు వందన సమర్పణ చేశారు.
వీనులవిందుగా అన్నమయ్య కీర్తనల ఆలాపన


