
113 మంది అనాథ పిల్లలు గుర్తింపు
మల్కన్‌గిరి: జిల్లాలోని పోడియా సమితిలో మహిళా, శిశు సంక్షేమ కార్యాలయ ప్రాంగణంలో శిశు మంగళ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఒక ప్రత్యేక క్యాంప్‌ను నిర్వహించి 113 మంది అనాథ పిల్లలను గుర్తించారు ఈ క్యాంప్ ద్వారా తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం తరుపున ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించి, మంచి విద్యనందించి భవిష్యత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా శిశు సురక్ష అధికారి నారాయణ్ దాస్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా శిశు మంగళ కమిటీ చైర్మన్ సంయుక్త ప్రధాన్, పోడియా సమితి అధ్యక్షురాలు రీనా రాణీ రాతౌ, చైల్డ్‌లైన్ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.