రాయగడ: మూతపడిన ఇసుక రీచ్ నుంచి అక్రమంగా టిప్పర్‌లో ఇసుకను తరలిస్తుండగా ఓఎంసీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులను నిర్వహించి టిప్పర్ సీజ్ చేశారు. అలాగే రూ.4 లక్షల జరిమానా విధించి ఇసుకను లోడింగ్ చేసే జేసీబీ మెషిన్ కూడా సీజ్ చేశారు. జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి గుడారి సమీపంలో వంశధార నది వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సమాచారం అందుకున్న ఓఎంసీ విభాగం జూనియర్ అధికారి రాజేంద్ర సేనాపతి నేతృత్వంలో ఒక టీమ్ ఆకస్మిక దాడులను నిర్వహించింది. ఈ క్రమంలో ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ని పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండడంతో పట్టుబడిన టిప్పర్ సీజ్ చేయడంతో పాటు భారీ ఎత్తున జరిమానా విధించారు.
ఆక్రమణల తొలగింపు పూర్తి
కొరాపుట్: ఎంతో వివాదాస్పదంగా మారిన ఎంజీ రోడ్డు ఆక్రమణల తొలగింపు అధికారులు పూర్తి చేశారు. బుధవారం కొరాపుట్ జిల్లా జయపూర్ పట్టణంలోని ఎంజీ రోడ్డుకి అధికారులు జేసీబీలతో చేరుకున్నారు. సంగీత్ జంక్షన్ వద్ద భవనాలను నేలమట్టం చేశారు. వీటిని కూల్చడానికి గతంలోనే యజమానులకు కాల వ్యవధి ఇచ్చారు. అయినప్పటికీ యజమానులు వాటిని కూల్చలేదు. దీంతో అధికారులే రంగంలోకి దిగి మిగతా పని పూర్తి చేశారు. ప్రస్తుతం కూల్చిన నిర్మాణాల వలన అక్కడ నిర్మితమవుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు అడ్డంకిగా ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు.
బావిలో పడి ఎలుగుబంటి మృతి
కొరాపుట్: వ్యవసాయ బావిలో పడి ఎలుగుబంటి మృతి చెందింది. ఈ సంఘటన కలహండి జిల్లా కెసింగా సమితి పాతిలా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. రైతు బిరాజ్ పటేల్‌కు చెందిన వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు ఎలుగుబంటి పడిపోయింది. గమనించిన గ్రామస్తులు కెసింగా అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అగ్నిమాపక సిబ్బందితో కలసి ఎలుగుబంటిని బయటకు తీశారు. అపస్మారకస్థితిలో ఉన్న భల్లూకాన్ని సమీప పశువైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. అటవీ శాఖ అధికారులు కేసు నమెదు చేశారు. ఎలుగుబంటి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు.
గోడకు కన్నం పెట్టి
దుకాణంలో చోరీ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి తర్లకోటా పంచాయతీలోని ఓ దుకాణంలో గోడకు కన్నం పెట్టి రూ.20వేలు సరుకులు దొంగిలించారు. గ్రామానికి చెందిన హరి హంతాల్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా షాపు అద్దెకు తీసుకుని అక్కడే కిరాణా షాపు నడుపుతున్నాడు. రోజూలాగానే మంగళవారం రాత్రి షాప్ మూసి ఇంటికి వెళ్లాడు. బుదవారం ఉదయం వచ్చి చూసే సరికి దొంగలు పడినట్లు గుర్తించారు. దీంతో కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐఐసి హిమాంశు శేఖర్ బారిక్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు.
ఇసుక టిప్పర్ సీజ్
ఇసుక టిప్పర్ సీజ్
ఇసుక టిప్పర్ సీజ్
ఇసుక టిప్పర్ సీజ్