
రబీ వరి కొనుగోళ్లు ప్రారంభం
భువనేశ్వర్: రాష్ట్రంలో బుధవారం నుంచి రబీ వరి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రైతుల ప్రయోజనాల పరిరక్షణ చర్యల్లో భాగంగా వరి సేకరణ సమయంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యా దు వస్తే సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో అధికారులకు ఆదేశించారు. వరి కొ నుగోళ్లు ఆరంభం పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ఆహార సరఫరా సంస్థ సందర్శించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. మండిల్లో వరి సేకరణ ప్రక్రియ, సీసీ టీవీ వ్యవస్థ పర్యవేక్షణ, మండి నుంచి మిల్లుకు వెళ్లే వాహనాల ను ట్రాక్ చేయడం, అనుబంధ ప్రత్యక్ష ఫుటేజ్ ఏర్పాటును మంత్రి పర్యవేక్షించారు. మండిల్లో రైతులు మరియు నోడల్ అధికారులతో మంత్రి సంభాషించి వారి సౌకర్యాలు మరియు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 ద్వారా సంప్రదించాలని అవగాహన కల్పించారు. వరి సేకరణకు సంబంధించి ఏ రైతు నుంచి అయినా ఫిర్యాదు అందితే దాన్ని తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని శాఖ అధికారులను ఆదేశించారు.