
మర్లభ ఘాటి వద్ద బస్సు ప్రమాదం
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ బ్లాక్ మర్లబ ఘాటీ దిగుతుండగా ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో భువనేశ్వర్ నుంచి ఆర్.ఉదయగిరి మీదుగా పర్లాకిమిడి వస్తుండగా ఇస్పాత్ అనే ప్రైవేటు బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 21 మందికి గాయాలయ్యాయి. వీరిని రాయగడ బ్లాక్ ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని పర్లాకిమిడి కేంద్ర ప్రభుత్వాస్పత్రికి ఉదయం తరలించారు. అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం బరంపురం మెడికల్‌కు తరలించారు. ప్రస్తుతం పర్లాకిమిడిలో కొంతమంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలానికి రాయఘడ పోలీసు అధికారులు చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మర్లబ ఘాటి వద్ద ఇలాంటి దుర్ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

మర్లభ ఘాటి వద్ద బస్సు ప్రమాదం

మర్లభ ఘాటి వద్ద బస్సు ప్రమాదం