
53 రోజుల ఆదాయం రూ.7.31 లక్షలు
పాతపట్నం: పాతపట్నంలో కొలువైన ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణిదుర్గ అమ్మవారి హుండీ ఆదాయం రూ.7,31,962లు వచ్చిందని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు చెప్పారు. సహాయ కమిషనర్ కార్యాలయం దేవదాయ శాఖ అధికారి జీవీబీఎస్ రవి కుమార్ పర్యవేక్షణలో సోమవారం హుండీ ఆదాయం లెక్కింపు జరిగిందన్నారు. 53 రోజులగాను ఆదాయం వచ్చిందని చెప్పారు. లెక్కింపులో శ్రీవెంకటేశ్వరస్వామి సేవా సమితి సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
సరుబుజ్జిలి: మండలంలోని పాలవలస గ్రామానికి చెందిన దాసరి అప్పన్న (47) సోమవారం చిగురువలస సమీపంలో పిడుగుపాటుకు మృతి చెందాడు. ఆయన రోజూ లాగానే చిగురువలస పంచాయతీ పరిధిలోని తాడికొండ వద్ద గొర్రెల మందను నిలిపి ఉంచారు. ఈ సమయంలో వాతావరణంలో ఒక్క సారి మార్పులు ఏర్పడి ఈదురుగాలులు, వర్షం కురిసి పిడుగుపడింది. పిడుగు ప్రభావానికి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య తులసమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
జగన్నాథుని నిధులు కై ంకర్యం
మందస: మందస మండలం సాబకోట గ్రామంలో జగన్నాథ స్వామి దేవాలయం నిధు లు కైంకర్యం అయ్యాయని, దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు సోమ వారం కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దేవస్థానం కోసం మందస రాజులు 25 ఎకరాలు ఇచ్చారని, 18 మంది రైతులు ఆ భూములు సాగు చేస్తూ శిస్తు చెల్లిస్తున్నారని, కానీ అధికారుల పర్యవేక్షణ లేక గుడి శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. కార్యనిర్వహణ అధికారి అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. రికార్డుల్లో మాయ చేసి నిధులు కై ంకర్య చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరపాలని కోరారు.
సాహితీవేత్త ‘పులఖండం’ కన్నుమూత
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం సాహితీ రంగంలో ఎనలేని సేవలు అందించిన డాక్టర్ పులంఖండం శ్రీనివాసరావు సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. వృత్తిపరంగా గాయత్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సాహి తీ రంగంలోనూ కృషి చేశారు. ముఖ్యంగా వ్యాఖ్యాతగా ఎన్నో కార్యక్రమాలను రమ్యంగా నిర్వహించారు. అష్టావధానం నిర్వహించడంలోనూ ప్రముఖ పాత్ర పోషించేవారు. శ్రీనివాసరావు విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యనభ్యసించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, బరంపురం యూనివర్సిటీలో ‘హరికథా వికాసం–ఉత్తరాంధ్రము’పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. పులఖండం మృతిపై సుమిత్ర కళాసమితి అధ్యక్ష, కార్యదర్శులు ఇప్పిలి శంకరశర్మ, గుత్తి చిన్నారువు, నక్కశంకరరావు, మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, నిక్కు అప్పన్న, ఉపనిషన్మందిరం అధ్యక్ష, కార్యదర్శులు గుమ్మానగేష్, కామేశ్వరరరావు, జంధ్యాల శరత్‌బాబు, నిష్టల నర్సింహమూర్తి, విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు తదితరులు సంతాపం ప్రకటించారు.
ఆయన నేత్రాలు సజీవం
టెక్కలి: టెక్కలి చిన్నబజారుకు చెందిన వ్యాపారి కింతలి చిట్టిబాబు సోమవారం మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులు చిట్టిబాబు నేత్రాలను దానం చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కుమారులు తిరుమలకుమార్, సురేష్‌కుమార్, అల్లుడు నేతాజీ గుప్తా తదితరులు పట్టణంలో అభయం యువజన సేవా సంఘానికి సమాచారం అందజేశారు. వారు రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్‌మోహన్‌రావుకు సమాచారం ఇవ్వడంతో, మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం నుంచి వైద్య బృందం టెక్కలికి చేరుకుని చిట్టిబాబు నేత్రాల నుంచి కార్నియాలను సేకరించారు.
మద్యం తాగి వాహనం
నడిపినందుకు 30 రోజులు జైలు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఏడురోడ్ల కూడలిలో ఈనెల 9న మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి సోమవారం కోర్టు 30 రోజులు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ నాగరాజు వెల్లడించారు. పోలాకి మండలానికి చెందిన ఇర్రి శ్రీను ఈనెల 9న మధ్యాహ్నం 2.05 గంటలకు ఏడురోడ్ల కూడలిలో ట్రాఫిక్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. వాహనాన్ని స్టేషన్‌కు తరలించిన ట్రాఫిక్ పోలీసులు శ్రీను పై కేసు నమోదు చేశారు. ఛలానాయే కదా.. కట్టేయొచ్చనుకుని కోర్టుకు వెళ్లిన శ్రీనుకు న్యా యమూర్తి 30 రోజుల జైలు శిక్ష విధించారు.

53 రోజుల ఆదాయం రూ.7.31 లక్షలు

53 రోజుల ఆదాయం రూ.7.31 లక్షలు

53 రోజుల ఆదాయం రూ.7.31 లక్షలు