
యాత్రికులకు అస్వస్థత
● మృతి చెందిన వృద్ధురాలు
ఇచ్ఛాపురం: తీర్థయాత్రకు బయల్దేరిన చిత్తూరు వాసులకు విషాదం ఎదురైంది. యాత్రికులు అస్వస్థతకు గురి కాగా ఒకరు మృతి చెందారు. చిత్తూరు జిల్లా, పె ద్ద పంజాని మండలం పరిధి లో గోనుమాకన్నపల్లితో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన 46 మంది ఓ ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా ఈ నెల 8న తీర్థయాత్రలకు బయల్దేరారు. దారిలో స్వయంగా భోజనాలు సిద్ధం చేసుకుని తినేవారు. కాశీ, అయోధ్య దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నెల 13న సాయంత్రం ఒడిశా స మీపించేసరికల్లా వీరిలో 30 మందికి వాంతు లు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గుర య్యారు. గురువారం ఇచ్ఛాపురం చేరుకునేసరికి ఇంకా ఎక్కువ మంది అస్వస్థతకు గుర య్యారు. దీంతో వీరు అదే బస్‌లో స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేరారు. వీరిలో పిచ్చుగల్లు మునిలక్ష్మమ్మ (69) ఆస్పత్రికి వచ్చేలోపే చనిపోయారని వైద్యులు పి.దేవేంద్రరెడ్డి తెలిపారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వా రు కోలుకుంటున్నారు. మృతురాలి చెల్లి తోటి గంగులమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ బి.జగదీశ్వరరావు కేసు నమోదు చేశారు.

యాత్రికులకు అస్వస్థత