
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్
జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లాలను(కొరాపుట్,రాయగడ, నవరంగపూర్, మల్కన్‌గిరి జిల్లాలు)ను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అవిభక్త కొరాపుట్ జిల్లాలకు చెందిన పలువురు డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక ఒక కల్యాణ మండపంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఖనిజ సంపదకు జల సంపదకు, అటవీ సందకు నిలయమైన అవిభక్త కొరాపుట్ నేటికీ అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉందని, ముఖ్యంగా ప్రయాణ సౌకర్యాలకు, విద్య, వైద్య, వ్యవసాయం, సాగునీటి వనరుల, నిరుద్యోగ సమస్యలతో కొట్టుమిట్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించేందుకు పాలకులు సంతృప్తికరమైన చర్యలు చేపట్టలేదని పలువురు విమర్శించారు. ఒడిశా రాష్ట్రం ఏర్పడి 89 ఏళ్లు గడిచినా అవిభక్త కొరాపుట్ అభివృద్ధిలో అభివృద్ధి చెందలేదన్నారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సమావేశంలో నాలుగు జిల్లాల నుంచి పలువరు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతిపాదిత కొరాపుట్ స్వతంత్ర రాష్ట్ర ఏర్పాటు సంఘం నిర్వహించిన సమావేశానికి దళిత సమాజ్ నేత ప్రభీర్ పాత్రో అధ్యక్షత వహించారు. సమావేశంలో రజిత్ బిశ్వాల్, జగన్నాథ్ పంగి, లలిత మోహణ నాయిక్, ప్రభాకర హంతాల్, దబ్యాధన్ సున, మనోరంజన్ కార్తీక్, భగీరత్ నాయిక్, అశోక్ పంగి. సుధీర్ పాత్రో, ఉదిత్ కోశ్ల, సను అనుగు, ప్రహ్లాద్ హంతాల్, మాలతీ మఝి, మనశ్విణీ టక్రి తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్