
గుణుపూర్ నుంచి కటక్‌కు వాల్వో బస్ సేవలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ నుంచి కటక్‌కు వాల్లో బస్ సేవలు సొమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవలను ఇకపై గుణుపూర్ ప్రాంత వాసులు పొందనున్నారు. గుణుపూర్ నుంచి కటక్, కటక్ నుంచి గుణుపూర్ వరకు రెండు బస్సులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ బస్‌లో ప్రయాణించేందుకు పురుషులకు 780 రూపాయలు టిక్కెట్టు ధర నిర్ధారించగా అదేవిధంగా మహిళలు ప్రయాణిస్తే వారికి టిక్కెట్‌లో 50 శాతం రాయితీ లభించనుందని సంబంధిత శాఖ అధికారులు తెలియజేశారు. గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర గనులు, రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ జెన్న గుణుపూర్ సమీపంలోని మీనాజోల ప్రాంతంలో పర్యటించిన సమయంలో ఆయన దృష్టికి సమస్యను గుణుపూర్ వాసులు తీసుకువెళ్లారు. ఈ మేరకు స్పందించిన మంత్రి బస్ సేవలకు శ్రీకారం చుట్టడంతో ఆయకు ధన్యవాదాలు తెలియజేశారు.