కాన్స్‌లో బాలీవుడ్‌ నటి రుచి : ప్రధాని మోదీ ఫోటో నెక్లెస్‌పై చర్చ | Ruchi Gujjar Look Viral At Cannes By Wearing PM Modi Necklace | Sakshi
Sakshi News home page

కాన్స్‌లో బాలీవుడ్‌ నటి రుచి : ప్రధాని మోదీ ఫోటో నెక్లెస్‌పై చర్చ

May 21 2025 11:05 AM | Updated on May 21 2025 12:08 PM

Ruchi Gujjar Look Viral At Cannes By Wearing PM Modi Necklace

78వ  కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Canne Film Festival 2025) వేడుక వైభవంగా జరుగుతోంది. ఫ్యాషన్‌ స్టైల్స్‌, గ్రామ్ లెన్స్, రెడ్ కార్పెట్ మెరుపులతో సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. అత్యంతప్రతిష్టాత్మక  కాన్స్‌రెడ్‌ కార్పెట్‌పై ఎవరి ప్రత్యేకతను వారు చాటుకుంటున్నారు. నటులు, మోడల్స్  ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇలా అందరూ ఫ్యాషన్ గేమ్‌ను  నెక్ట్స్‌ లెవల్‌ అనిపించుకుంటన్నారు. తాజాగా  బాలీవుడ్‌ నటి రుచి గుజ్జర్ (Ruchi Gujjar) లుక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ప్యారిస్‌లో జరుగుతోన్నకాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో  రుచి ధరించిన మూడు మోదీ ఫోటోలతో ఉన్న నెక్లెస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.  

భారత  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రంతో ఉన్న నెక్లెస్‌తోపాటు, అందమైన లెహెంగాలో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. దీనికితోడు రుచి అందమైన లెహంగాతో  కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ 2025లో ఔరా అనిపించుకుంది.  సాంప్రదాయ గాజులు, భారీ మాంగ్-టీకా, దానికి సరిపోయే చెవిపోగులతో, ఆమె తన లుక్‌ను అందంగా తీర్చిదిద్దుకుంది. లేత గోధుమ రంగు లెహంగాకు  నక్సీ వర్క్‌ ఉన్న డీప్-ప్లంగింగ్ బ్లౌజ్, స్కర్ట్‌ను జత చేసింది. హర్యాన్వి బంధానీ దుప్పట్టా ఆకర్షణీయంగా నిలిచింది. స్కర్ట్‌ అంతా అద్దాలను పొందుపరిచారు. బంధానీ దుప్పట్టాను జరిబారికి చెందిన రామ్ రూపొందించారని, దీని ద్వారా రాజస్థాన్‌  ఆత్మను కప్పుకున్నట్టు అనిపించిందని వ్యాఖ్యానించింది.

స్టేట్‌మెంట్ నెక్లెస్, హైలైట్
కాన్స్‌లో రుచి గుజ్జర్‌ లుక్‌ చర్చకు దారితీసింది.  పీఎం మోదీ ముఖంతో డిజైన్‌ చేసిన డబుల్‌ లేయర్డ్‌, నెక్లెస్ ధరించి తళుకున్న మెరిసింది. ఒకటి మినీ-పెర్ల్స్‌తో తయారు చేసిన చోకర్ కాగా, మరొకటి స్టేట్‌మెంట్ పీస్. స్పెషల్‌ నెక్లెస్‌పై మూడు కమలాల మోటిఫ్‌లో మోదీ ఫోటోను జతచేసి ఉండటం హైలైట్‌. తన నెక్లెస్ గురించి మాట్లాడుతూ..ఇది ప్రత్యేకమైందీ, ప్రతీకాత్మకమైనదని చెప్పింది రుచి.   ఇది కేవలం నెక్లెస్ కాదు, భారతదేశం  బలానికి  ఉన్నతికి చిహ్నం. ప్రపంచ వేదికపై దేశం బలాన్ని, పటిష్టతను ఇది చాటి చెప్పుతుందని తెలిపింది.  భారతదేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ప్రధాని మోదీని గౌరవార్ధం దీన్ని ధరించినట్టు చెప్పింది. 

దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పో​స్ట్‌ చేయడంతో  నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. రుచి గుజ్జర్ ఫోటోలు వైరల్  కావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.  కొందరు ఆమె లుక్‌ చూసి ఆశ్చర్యపోగా, మరికొందరు అద్భుతం అంటూ మెచ్చుకున్నారు.  ఒక యూజర్ మాత్రం  "యే క్యా బక్వాస్ హై" అని కామెంట్ చేశారు. మరొక యూజర్ "మీ తలపై హర్యాన్వి దుపట్టా" అని కామెంట్ చేశారు. మూడవ వినియోగదారుడు, "అన్నీ  ఆర్గానిక్‌గా బాగున్నాయి  కానీ మోదీజీ ఫోటో ఎందుకు?" అంటూ నిట్టూర్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement