
ఇస్లామాబాద్: భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అత్యున్నత మిలటరీ హోదా అయిన ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రధాని షరీఫ్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై చర్చించి, ఆమోదం తెలిపిందని పేర్కొంది.
ఇటీవల భారత్‌తో తలెత్తిన సైనిక ఉద్రిక్తతల సమయంలో పాక్ బలగాలను విజయం దిశగా నడిపించిన మునీర్ పదోన్నతి పొందారని స్థానిక మీడియా తెలిపింది. ఈ విషయంలో ఆయన అద్వితీయమైన పాత్ర పోషించారని ప్రశంసించింది. యుద్ధంలో తమదే విజయమంటూ పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటుండగా, భారత్ మాత్రం సాక్ష్యాధారాలతో వివిధ అంతర్జాతీయ వేదికలపై వాస్తవాలను వివరిస్తూ వస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ తిరుగులేని అధికారాలను చెలాయిస్తున్న మునీర్‌కు ఇటీవల ఆ దేశ సుప్రీంకోర్టు మరిన్ని అధికారాలను కట్టబెట్టడం తెల్సిందే. తాజాగా, ఆయనకు ప్రమోషన్ సైతం లభించడం గమనార్హం.
Government of Pakistan has promoted Army Chief General Asim Munir to the rank of Field Marshal. ⭐⭐⭐⭐⭐ pic.twitter.com/NNrAM9Npzp
— Ambassador Murad Baseer (@muradbaseer) May 20, 2025