
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న ఐదున్నర కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను పూర్తి స్థాయిలో పరిశీలించే ప్రక్రియ మొదలైందని ట్రంప్ యంత్రాంగం గురువారం వెల్లడించింది. వీసా దారుల్లో ఎవరైనా వీసా నిబంధనలను ఉల్లంఘించారా అన్నది నిర్థారించడమే దీని ఉద్దేశమని తెలిపింది.
నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడినా, ఉగ్ర సంస్థలకు మద్దతు పలికినా వీసా కాలపరిమితికి మించి దేశంలో నివసిస్తున్నా, యూదు వ్యతిరేక చర్యలు సహా ప్రజా భద్రతకు భంగం కలిగించినట్లు భావించిన వారిపై సైతం తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. వారి వీసాలను రద్దు చేస్తామని, స్వదేశాలకు తిప్పిపంపించి వేస్తామని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లోనూ వీసాదారులపై ఓ కన్నేసి ఉంచుతామని తెలిపింది. అమెరికా పౌరులకు, సంస్కృతి, ప్రభుత్వం, సూత్రాలు, నిబంధనలకు భంగం వాటిల్లేలా వ్యవహరించినట్లు గుర్తించినా చర్యలు తప్పవని పేర్కొంది.
అమెరికా వ్యతిరేక భావజాలం కలిగిన వారికి ప్రయోజనాలను అందివ్వబోమని యూఎస్ సిటిజన్íÙప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్ ప్రతినిధి మాథ్యూ ట్రగెస్సర్ తెలిపారు. కాగా, అమెరికాలో సుమారు 50 లక్షల మంది భారతీయ వీసాదారులున్నట్లు అంచనా. ట్రంప్ ప్రభుత్వ తాజా ప్రకటనతో వీరందరిలోనూ ఆందోళన మొదలై ంది. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 6 వేల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేయడం తెల్సిందే. అదేవిధంగా, 12 దేశాల ప్రయాణికులపై పూర్తిస్థాయి నిషేధంతోపాటు మరో ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించింది.
విదేశీ ట్రక్కు డ్రైవర్లకు నో వీసా
వాణిజ్య ట్రక్కు డ్రైవర్లుగా పనిచేసే విదేశీయులకు వీసాల మంజూరు నిలిపివేసినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో గురువారం ఎక్స్ వేదికగా ఈ విషయం ప్రకటించారు. తక్షణమే ఇది అమల్లోకి వచ్చిందన్నారు. ‘పెద్ద ట్రాక్టర్–ట్రైలర్ ట్రక్కులపై డ్రైవర్లుగా పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న విదేశీయుల కారణంగా దేశంలో రహదారులపై ప్రయాణించే పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.
అమెరికన్ ట్రక్కు డ్రైవర్లకు జీవనోపాధి సైతం దెబ్బతింటోంది’అని ఆయన వివరించారు. ప్రస్తుతం అమెరికాలో ఎంత మంది విదేశీ ట్రక్కు డ్రైవర్లు పనిచేస్తున్నదీ విదేశాంగ శాఖ వెల్లడించలేదు. ట్రక్కు డ్రైవర్లుగా పనిచేయాలనుకునే విదేశీయులు ఇంగ్లి‹Ùను చక్కగా మాట్లాడటం, రాయడం తెలిసుండాలంటూ ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు చేయడం తెల్సిందే. రహదారి హెచ్చరికలను, సూచనలను చదివి సరిగ్గా అర్థం చేసుకోలేని డ్రైవర్ల కారణంగా రహదారి ప్రమాదాలు పెరుగుతున్నాయని రవాణా శాఖ ఆరోపిస్తోంది. రహదారి భద్రతను పెంచడమే తమ లక్ష్యమని చెబుతోంది.