
హుర్రే.. ఆపరేషన్ సింధూర్‌కి కౌంటర్‌గా ఆపరేషన్ భున్‌యన్‌తో భారత్‌పై విజయం సాధించాం అంటూ పాక్ చేస్తున్న వేడుకలు, వరుస ప్రకటనలు నవ్వులు పూయిస్తున్నాయి. ఒకదానికి తర్వాత మరొకటి తప్పుడు ప్రచారాలతో పరువు పొగొట్టుకుంటోంది ఆ దేశం. తాజాగా..
ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్(Asim Munir) చేసిన పని.. విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఆపరేషన్ భున్‌యాన్ సక్సెస్ పేరిట ఆయనో డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్, సెనేట్ చైర్మన్ యూసుఫ్ రజా గిలానీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే..
ఆపరేషన్ భున్‌యన్(Operation Bunyan) విక్టరీకి గుర్తుగా ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌కు ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ఓ పెయింటింగ్ బహుకరించారు. కానీ.. అందులో ఉన్న తప్పును కొందరు టక్కున పట్టేశారు. నాలుగేళ్ల కిందట చైనా జరిపిన మిలిటరీ ఆపరేషన్ తాలుకా చిత్రమది. ఆ చిత్రాన్ని ముందూ వెనుక చూడకుండా ఆపరేషన్ భున్‌యాన్ చిత్రమంటూ అదీ ఆర్మీ చీఫ్ ప్రధాని బహుకరించడం విడ్డూరంగా పేర్కొంటున్నారు కొందరు.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కశ్మీరంలోని ఉగ్ర శిబిరాలను నాశనం చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత్. అయితే.. ఆపరేషన్ భున్‌యన్ ఉన్ మర్సూస్‌తో తామూ భారత్‌పై దాడులు జరిపి ఘన విజయం సాధించామని పాక్ ప్రకటించుకుంటూ వస్తోంది. కానీ,
అంతర్జాతీయ సమాజానికి తగిన ఆధారాలు మాత్రం చూపించకపోయింది. వరుసగా.. ఇలాంటి ఫేక్ ప్రచారాలతో పాక్ పరువు మళ్లీ మళ్లీ పోగొట్టుకుంటూ వస్తోంది. భారత్‌పై విజయం అంటున్నారు కదా.. దానికి తగిన ఆధారం ఒక్కటైనా చూపించలేని స్థితిలో పాక్ ఉందంటూ పలువురు జోకులు పేలుస్తున్నారు.
ఇదీ చదవండి: నన్ను ఆపేస్తే నీ సంబంధం బయటపెడతా!