Shahabaz Sharif
-
భారత్‌తో దాయాది యుద్ధం.. బలం కోసం పాక్ ప్రధాని కొత్త ఎత్తులు!
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్ర దాడిలో కారణంగా ఈ పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, పాక్ ఆర్మీ సైనికులు ఈ ఘటనలో భాగం కావడంతో దాయాదిపై దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు చెక్ పెడుతూ.. ఎప్పటికప్పడు భారత్ బలగాలు యుద్దానికి సిద్ధమవుతున్నాయి. దీంతో, భారత్ చర్యలపై భయంతో వణికిపోతున్న పాక్.. రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాలతో పాక్ ప్రధాని మంతనాలు జరుపుతున్నారు.వివరాల ప్రకారం.. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్‌కు భారత్ భయం పట్టుకుంది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందో తెలియక భయంతో వణికిపోతోంది. మరోవైపు.. దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అనేక దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా సైతం చేతులు కలిపింది. దీంతో, పాకిస్తాన్‌కు మరింత ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో పాక్ సర్కార్.. ప్రపంచ దేశాల సాయం చేతులు చాస్తోంది. సాయం చేయాలని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మంతనాలు జరుపుతున్నారు.నేతలతో పాక్ ప్రధాని చర్చలు..తాజాగా ప్రధాని షహబాజ్ షరీఫ్.. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్‌తో మాట్లాడి రెండు దేశాల మధ్య ఘర్షణను తగ్గించాలని కోరారు. ఉద్రిక్తతలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని అరేబియా, యూఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాధినేతలతో భేటీ అయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హమర్ ఒబైద్ ఇబ్రహీం అల్ జాబీతో పాక్ ప్రధాని సమావేశమయ్యారు. కువైట్ రాయబారి నాసన్ రెహ్మన్ జాసన్‌ను కూడా పాక్ ప్రధాని కలిసి విజ్ఞప్తి చేశారు.Chinese Ambassador in Pakistan, H.E Jiang Zaidong calls on Prime Minister Muhammad Shehbaz Sharif in Islamabad.May 1, 2025. pic.twitter.com/wmJlR2b0gk— Prime Minister's Office (@PakPMO) May 2, 2025ఈ మేరకు పాక్ పీఎంఓ ఓ ప్రకటనలో.. పాకిస్తాన్‌లోని సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయిద్ అల్ మాలికితో షహబాబ్ సమావేశమైన ఫొటోను విడుదల చేసింది. ఈ సందర్బంగా దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోసం పాకిస్తాన్ కృషి చేస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారని తెలిపింది. ఇదిలా ఉండగా.. భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పటికే చైనా, రష్యాలను అభ్యర్థించింది. ఈ దాడిపై నిష్పక్షపాత విచారణకు సహకరిస్తామని పాక్ చెప్పుకొచ్చింది.Ambassador of UAE to Pakistan H.E. Hamad Obaid Ibrahim Salem Al-Zaabi called on Prime Minister Muhammad Shehbaz Sharif.May 2, 2025. pic.twitter.com/c2KGCrKvbB— Prime Minister's Office (@PakPMO) May 2, 2025పాక్‌కు మద్దతిచ్చే దేశాలు ఇవే..ఇక, పాకిస్తాన్‌పై భారత్ దాడులు చేస్తే.. దాయాది కొన్ని దేశాలు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. చైనా, టర్కీ, అజర్ బైజాన్, బంగ్లాదేశ్, కొన్ని ముస్లిం లీగ్ దేశాలు పాక్‌కు అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు టర్కీ సైతం మద్దతు తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ కు మద్దతుగా పలుమార్లు టర్కీ నిలిచింది. భారత్‌తో వైరం కారణంగా చైనా.. పాక్‌కు అండగా ఉండనుంది. ప్రస్తుతం భారతదేశంలో అంతగా సఖ్యతలేని బంగ్లాదేశ్ కూడా పాక్‌కు మద్దతుగా నిలిచి అవకాశం కనిపిస్తున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో భాగంగా అక్కడ మారిన ప్రభుత్వం భారత్ కు అనుకూలంగా లేదు. కనుక ఈ దాయాది దేశం కూడా మనకు వ్యతిరేకంగా నిలిచి అవకాశం ఉంటుంది. -
ఓటమి ఎఫెక్ట్.. పాకిస్థాన్ క్రికెటర్లు, బోర్డుకు ఝలక్!
ఇస్లామాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ప్రదర్శన ఆ దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లో(భారత్, న్యూజిలాండ్) ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు అయ్యింది. దీంతో, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్, పీసీబీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు.. పాకిస్థాన్ టీమ్ ఆటతీరుపై రాజకీయ నాయకులు కూడా దృష్టి సారించారు. రిజ్వాన్ సేన దారుణ ఆటతీరు, పీసీబీ వ్యవహారాలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్తామని ప్రధాని రాజకీయ, ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా వెల్లడించారు. పార్లమెంట్లో జట్టు ప్రదర్శనపై చర్చించాలని ప్రధాని షెహబాబ్ను కోరుతామని అన్నారు. జట్టు ఓటమిపై ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఈ సందర్బంగా సనావుల్లా మాట్లాడుతూ.. పాక్ క్రికెట్ జట్టు ఆట తీరుపై ప్రధాని వ్యక్తిగతంగా దృష్టిసారించాని కోరుతాం. జట్టు ఆటతీరు దారుణంగా ఉంది. పాక్ దారుణ ప్రదర్శనపై మంత్రివర్గంలో, పార్లమెంటులో ప్రస్తావించాలనుకుంటున్నాం. క్రికెట్ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ. పాక్ బోర్డు తమ దగ్గర ఉన్న నగదును వేటికి ఎలా ఖర్చుపెడుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. పీసీబీలోని కొందరు అధికారులు నెలకు ఐదు మిలియన్లకు వరకు అందుకుంటున్నారు. వారు తమకు నచ్చినట్లు చేయగలరు. కానీ, వారి బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలం అవుతున్నారు. గత దశాబ్ద కాలంగా మనం క్రికెట్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం. ఆటగాళ్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం భారీగా ఉన్నాయి. ఇవన్నీ జట్టు ప్రదర్శనపై ప్రభావితం చూపుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆట తీరుపై పార్లమెంట్లో వాడేవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కథ ముగిసింది. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండానే(బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జట్టు దారుణమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లలో ఆందోళనను రేకెత్తించింది. ఇలాంటి వైఫల్యాలకు జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఒక్కటే కారణం కాదని, పాక్ జట్టు దేశవాలీ వ్యవస్థ పూర్తిగా క్షీణించడం అని వారు చెబుతున్నారు. -
పాకిస్థాన్‌లో కొత్త సర్కార్‌కు లైన్ క్లియర్!.. ప్రధాని ఆయనేనా?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల పాక్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపిస్తున్న వేళ అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. అధికార ఒప్పందానికి సంబంధించి పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల మధ్య డీల్ కుదిరింది. వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల మధ్య ఒప్పందంతో వచ్చే నెల రెండో తేదీ నాటికి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే మార్చి తొమ్మిదో తేదీలోగా పాక్‌లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. కాగా, దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలు ఈ నెల 29న ప్రమాణం చేస్తాయని, రెండో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని న్యూస్ ఇంటర్నేషనల్ ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం తొమ్మిదో తేదీలోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారని వెల్లడించింది. ఇక, మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కు మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మద్దతు ఇస్తోంది. ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నాటి లెక్కింపులో పాక్‌లోని ఏ ఒక్క పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత స్థాయిలో ఆధిక్యం దక్కలేదు. దీంతో హంగ్ తప్పని పరిస్థితి నెలకొంది. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (72) మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌కు మరో బిగ్ షాక్
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పాక్ మాజీ పీఎం ఇమ్రాన్‌ఖాన్‌తో సహా మరో 150 మందిపై పోలీసులు నమోదు చేశారు. దీంతో దేశంలో వీరి అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. సౌదీ అరేబియాలోని మస్జిద్-ఎ-నబ్వీ వద్ద ప్రధాని షహబాజ్ షరీఫ్‌ను ఉద్దేశించి ఇమ్రాన్ సహా మరికొంత మంది నేతలు దొంగ, ద్రోహి అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. పాకిస్తాన్ శిక్షా స్మృతిలోని సెక్షన్ 295ఏ కింద ఇమ్రాన్‌తో సహా 150 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాను ఎవరికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ఇక కేసు నమోదైన వారిలో మాజీ మంత్రులు ఫవాద్ చౌదరి, షహబాజ్ గుల్, షేక్ రషీద్ ఉన్నారు. ఇది కూడా చదవండి: చైనా కంపెనీ షావోమీకి బిగ్ షాక్ -
పాక్ తాత్కాలిక ప్రధానిగా అబ్బాసీ
షహబాజ్ షరీఫ్ పార్లమెంటుకు ఎన్నికయ్యే వరకే... ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా పీఎంఎల్–ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్) సీనియర్ నేత, మాజీ పెట్రోలియం శాఖ మంత్రి షాహిద్ ఖక్కన్ అబ్బాసీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షహబాజ్ షరీఫ్ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు నవాజ్ షరీఫ్ నేతృత్వంలో శనివారం సమావేశమైన పీఎంఎల్–ఎన్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించి నవాజ్ షరీఫ్ ఎన్నికల సంఘానికి తప్పుడు వివరాలు సమర్పించారంటూ పాక్ సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగేందుకు అనర్హుడిగా ప్రకటించగా, ఆయన ప్రధాని పదవిని కోల్పోవడం తెలిసిందే. షరీఫ్, ఆయన పిల్లలపై అవినీతి కేసులు నమోదు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. పాక్ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ప్రధాని పదవి చేపట్టాలంటే ముందుగా కచ్చితంగా వారు జాతీయ అసెంబ్లీలో సభ్యులై ఉండాలి. అయితే ప్రస్తుతం పాక్‌లోని పంజాబ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న షహబాజ్ పార్లమెంటు సభ్యుడు కాదు. ఈ నేపథ్యంలో షహబాజ్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా షాహిద్ అబ్బాసీని నియమించాలని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. షహబాజ్ ఎన్నిక కాగానే అబ్బాసీ రాజీనామా చేస్తారు. దాదాపు 45 రోజులపాటు అబ్బాసీ పదవిలో ఉండే అవకాశం ఉంది. అలాగే నవాజ్ షరీఫ్‌పై సుప్రీంకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని కూడా పార్టీ సమావేశంలో నిర్ణయించారు. షరీఫ్‌పై అనర్హత ఎంతకాలం? నవాజ్ షరీఫ్‌పై అనర్హత ఎంతకాలం ఉంటుంది? ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రావటం సాధ్యమేనా? పాకిస్తాన్ న్యాయనిపుణులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజల్లో ఈ ప్రశ్నలపై చర్చ జరుగుతోంది. దీనిపై న్యాయ నిపుణులు కూడా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. కొన్నేళ్ల వరకు దీనిపై ఓ స్పష్టత రాదని మరికొందరి అభిప్రాయం. ఇది శాశ్వత అనర్హతేనని పాక్ బార్ కౌన్సిల్ చెబుతుండగా.. తాత్కాలికమేనని మాజీ న్యాయమూర్తులంటున్నారు. ‘పార్లమెంటు సభ్యులు నిజాయితీపరులై ఉండాలని ఆర్టికల్ 62, 63 చెబుతున్నాయి. అయితే వ్యక్తుల్లో మార్పు వచ్చిన తర్వాత కూడా అనర్హత కొనసాగించటం సరికాదు’ అని ఇలాంటి కేసులను విచారించిన పాక్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అన్వర్ జహీర్ పేర్కొన్నారు. ఈ ఆర్టికల్స్ ఆధారంగా శాశ్వత అనర్హత విధించటంపై, ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్చ జరగాలని ఆయన తెలిపారు. 62(1)(ఎఫ్) ప్రకారం ఎన్నేళ్ల అనర్హత అనే అంశంపై స్పష్టత లేదని.. అయితే 2012లో యూసుఫ్ రజా గిలానీపై ఆర్టికల్ 63 ప్రకారం ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసిన విషయాన్ని మరో న్యాయవాది గుర్తుచేశారు. అవినీతిపరులకు హెచ్చరిక: మీడియా నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు వేయడం ద్వారా సుప్రీం కోర్టు అవినీతిపరులకు గట్టి హెచ్చరికలు పంపిందని పాక్ మీడియా పేర్కొంది. ప్రజాస్వామ్య విధానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నాయకులు శ్రమించాలని పిలుపునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు పాక్‌లో రాజకీయ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందని ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక డాన్ తన సంపాదకీయ వ్యాసంలో వ్యాఖ్యానించింది. ముషార్రఫ్ హర్షం నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటువేయడంపై పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ హర్షం వ్యక్తం చేశారు. సిట్టింగ్ ప్రధానిని అనర్హుడిగా ప్రకటించినందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. నవాజ్, ఆయన పిల్లలు దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందనీ, వారిని ఎక్కడికీ వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించాలని ముషార్రఫ్ అన్నారు. ఇదీ ఆర్మీ కుట్రేనా? ► భారత్‌తో సత్సంబంధాలకు షరీఫ్ యత్నంపై వ్యతిరేకత ► న్యాయవ్యవస్థతో కలసి ప్రభుత్వంపై తిరుగుబాటు! పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటుకు పాకిస్తాన్ మిలటరీ నాయకత్వం, ప్రజా ప్రభుత్వం మధ్య కొంతకాలంగా జరుగుతున్న అంతర్గత ఘర్షణే కారణమనే వాదన వినిపిస్తోంది. మిలటరీ, న్యాయవ్యవస్థలు సంయుక్తంగా పన్నిన కుట్రలో భాగంగానే తాజా తీర్పు వెలువడినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఏకాకి అవుతున్న పాక్‌ను కాపాడేందుకు షరీఫ్ చేసిన ప్రయత్నమే పదవీచ్యుతున్ని చేసినట్లు సమాచారం. పాక్ ఆర్మీ, ఇస్లామిక్ ఛాందసవాదులు షరీఫ్‌ను పావురం(శాంతిదూత)గా పిలుస్తారు. భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించుకోవటం, వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకుని పాక్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇది నచ్చని మిలటరీ.. షరీఫ్ తమ అధికారాన్ని తగ్గిస్తున్నారని భావిస్తున్నట్లు డాన్ పత్రిక పేర్కొంది. అందుకే తిరిగి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కొంతకాలంగా ఆర్మీ ప్రయత్నిస్తోంది. చైనా కూడా ప్రశ్నిస్తోంది.. ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి భేటీలో ఉగ్రవాదులపై వివిధ ప్రావిన్సులు తీసుకునే చట్టపరమైన చర్యల్లో మిలటరీ ఆధీనంలో పనిచేసే ఐఎస్ఐ జోక్యం చేసుకోకూడదని షరీఫ్ కోరారు. దీంతోపాటుగా ముంబై దాడులు, పఠాన్‌కోట్ ఘటనలపై విచారణను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ముగించేయాలని సూచించారు. ఈ సమావేశంలో పాక్ విదేశాంగ కార్యదర్శి చౌదరీ ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. అమెరికా సూచించినట్లుగా హక్కానీ నెట్‌వర్క్‌పై చర్యలు తీసుకోవటం, పఠాన్‌కోట్ విచారణను త్వరగా పూర్తిచేసి జైషే మహ్మద్‌పై చర్యలు తీసుకోవటం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. పాకిస్తాన్‌కు మద్దతును చైనా పునరుద్ఘాటిస్తున్నప్పటికీ.. పలు అంశాల్లో పాక్ తీరుమార్చుకోవాలంటూ సూచించటాన్నీ వెల్లడించారు. మసూద్‌పై యూఎన్ నిషేధాన్ని కారణం లేకుండా ఎంతకాలం వ్యతిరేకించాలని చైనా ప్రశ్నిస్తోందన్నారు. ఉగ్రవాదులపై చర్యల అంశంపై జనరల్ ఐఎస్ఐ డీజీ జనరల్ అక్తర్, ప్రభుత్వ అధికారుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. భారత ఒత్తిడికి తలొగ్గొద్దని అక్తర్ స్పష్టం చేశారు. ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోకతప్పదని షరీఫ్ అన్నారు. దీంతో మిలటరీ, న్యాయ శాఖ కలసి షరీఫ్‌ను గద్దెదించాలని పథకం పన్నినట్లు భావిస్తున్నారు. మిలటరీ తిరుగుబాటు సాధారణమే! పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఆర్మీ యత్నిస్తుంటుంది. న్యాయవ్యవస్థా అందుకు సాయం చేస్తుంటుంది. మాజీ ఆర్మీ చీఫ్ ముషార్రఫ్ గతంలో నవాజ్ షరీఫ్‌ను గద్దెదింపి 8 ఏళ్లపాటు పాక్‌లో మిలటరీ పాలన నడిపారు. పలు సందర్భాల్లో మిలటరీ అధికారికంగానే ప్రభుత్వాన్ని నడిపించింది. పనామా వివాదంలో షరీఫ్, ఆయన కుటుంబసభ్యులపై విచారణ కొనసాగుతోంది. దీనిపై తుది నివేదిక రాకముందే ఆర్మీ ఆదేశాలతోనే సుప్రీం కోర్టు షరీఫ్‌పై అనర్హత వేటు వేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్