
మద్దతు ఇవ్వాలి
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025
సాయుధ దళాలకు..
● రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభవపాటి హరిబాబు
భువనేశ్వర్: ఉగ్రవాదానికి మతం లేదు, హింసకు గ్రంథం లేదని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి స్థానిక రాజ్ భవన్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో అన్నారు. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మత సంస్థ అధిపతులు, వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి హాజరయ్యారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ డాక్టర్ కంభంపాటి ఇది అమాయక పౌరులపై జరిగిన దాడి మాత్రమే కాదు, భారత దేశం అనే భావనపై – మన ఐక్యత, ప్రజాస్వామ్యం, శాంతిపై – దాడి అని అన్నారు. సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని కచ్చితమైన దాడులతో కూడిన ఆపరేషన్ సిందూర్‌ను సాయుధ దళాలు ప్రారంభించాయని ఆయన సభకు తెలియజేశారు. మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి మన ధైర్యవంతులైన సైనికులు మరోసారి ముందంజ వేశారని పేర్కొన్నారు. ఈ కీలక సమయంలో మనం వారి వెనుక దృఢంగా నిలబడాలని రాష్ట్ర గవర్నర్ కోరారు. మరణించిన వారి కోసం, గాయపడిన వారి కోసం ప్రార్థనలు చేయాలని ఆయన మత సంస్థలకు పిలుపునిచ్చారు. సంఘీభావ ప్రదర్శనలో జాతీయ జెండాను ఎగురవేయాలని విద్యా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. సమావేశం ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపుతుందని, విశ్వాసం, భాష, ఆచారాలలో వైవిధ్యం ఉన్నప్పటికీ మన దేశాన్ని, దాని విలువలను రక్షించుకునే విషయంలో మనం ఐక్యంగా ఉన్నామని ఆయన అన్నారు. డాక్టర్ హరిబాబు కంభంపాటి పౌరులు, సైనికులు సహా బాధితుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలిపారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారత దేశం ఎప్పటికీ ఉగ్రవాదానికి తలవంచదని ప్రపంచానికి సందేశం పంపుదామన్నారు. మన ఐక్యత, మనల్ని రక్షించే వారికి అచంచలమైన మద్దతు మన బలం అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఉగ్రవాదం మానవాళిపై యుద్ధం అని తెలిపారు. దేశానికి అవసరమైనప్పుడల్లా అన్ని సమాజాలు ఎలా కలిసి వస్తాయో చరిత్ర చూపిస్తుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ హమీద్ ధైర్యం, త్యాగాన్ని ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. మన గొప్ప గుర్తింపు భారతీయులుగా ఉండటం, కులం, మతం లేదా మత సంబంధాలకు అతీతంగా మనమందరం భారతీయులమని ఆయన అన్నారు. ఈ సర్వ ధర్మ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, అదనపు ప్రధాన కార్యదర్శి సత్యబ్రత సాహు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వై. బి. ఖురానియా మరియు సీనియర్ రక్షణ సిబ్బంది పాల్గొన్నారు.
న్యూస్‌రీల్

మద్దతు ఇవ్వాలి

మద్దతు ఇవ్వాలి