
ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా సరిహద్దున ఉన్న బైపారగూఢ పంచాయతీ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నయాగడ నుంచి మల్కన్‌గిరి వస్తున్న ఓ వాహనం చెట్టును ఢీకొట్టి నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వేసవి సెలవులు కావడంతో నయాగడ నుంచి బంధువుల ఇంటికి సుజిత్ కుమార్ సింగ్ సామంత్ (45), పద్మినీ సింగ్ సామంత్ (42), ప్రియాంశు (10), అంబికాబానా దాస్(65), శశి బెహర (65) గురువారం బయల్దేరారు. వీరు మల్కన్‌గిరిలో ఉంటున్న ప్రదీప్ కుమార్ సింగ్ సామంత్ ఇంటికి వస్తున్నారు. మరో గంటలో ఇంటికి చేరుకుంటామనగా కారు చెట్టును ఢీకొట్టింది. ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. డ్రైవర్ విభూతి భూషన్ బెహర నిద్రమత్తులో చెట్టును ఢీకొన్నట్టు గుర్తించారు. మృతులు విభూతి భూషన్ బెహర (44), అంబికా బానా దాస్, శశి బెహర మృతదేహాలను బపారగూఢ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. క్షతగాత్రులను కొరాపూట్ లక్ష్మణ్ నాయిక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పద్మినీ ఆస్పత్రిలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మల్కన్‌గిరి నుంచి ప్రదీప్ కుమార్ సింగ్ సామంత్, బావమరిది రాజేంద్ర జెన సామంత్ ఇద్దరు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బైపారగూఢ పోలీసులు సంఘటనపై కేసులు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి