
సమస్యలు పరిష్కరిస్తే సహకరిస్తాం
జయపురం: తమ సమస్యలు పరిష్కరిస్తేనే యాజమాన్యానికి సహకరిస్తామని గగణాపూర్ సేవా పేప రు మిల్లు రెండు కార్మిక యూనియన్ల నేతలు స్పష్టం చేశారు. బుధవారం ప్రథమ, ద్వితీయ యూనియన్ల నేతలు జిల్లా జాయింట్ లేబర్ కమిషనర్ బృందావన సెట్టికి, జయపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. 2020 ఫిబ్రవరి 26వ తేదీన మిల్లు అమ్మకం సమయంలో జరిగిన బిజినెస్ ట్రాన్స్‌ఫర్ అగ్రిమెంట్ ప్రకారం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో మిల్లులోని నాలుగు యూనియన్లు కలిసి ఒక వర్కింగ్ కమిటీ ఆఫ్ యూనియన్స్‌గా ఏర్పడి సమస్యల పరిష్కారానికి పోరాడామన్నారు. అయి తే ప్రస్తుతం యాజమాన్యం రెండు యూనియన్లతో కార్మికులను పీడిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో కార్మిక నేతలు ప్రదీప్ పంజియ, సరోజ్ సు వార్, వంశీధర మహుంకుడో, కె.సత్యనారాయణ, అలేక్ పాత్రో, ఉమా శతపతి, రోహిత్ థోమస్ తదితరులు పాల్గొన్నారు.