
ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి
రాయగడ: రానున్న వర్షాకాలంలో ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అన్నారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ ఫరూల్ పట్వారీ అధ్యక్షతన జిల్లా స్థాయి ప్రకృతి విపత్తు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వంశధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నవీన్‌చంద్ర నాయక్, ఎమర్జెన్సీ అధికారి మనోజ్ కుమార్ నాహక, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చంద్రకాంత్ మాఝి, బీడీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే కడ్రక. పక్కనే కలెక్టర్ పట్వారీ తదితరులు