
దివ్యాంగులను ఆదరించడం సామాజిక బాధ్యత
కొరాపుట్: దివ్యాంగులను ఆదరించడం సామాజిక బాధ్యత అని నబరంగ్‌పూర్ ఎంపీ బలబద్ర మజ్జి పేర్కొన్నారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో మండయ్ గ్రౌండ్స్ సమీపంలో డాల్ఫిన్ రిసార్టులో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అమర్చే శిబిరంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దివ్యాంగులైనందుకు చింతించవద్దన్నారు. ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రస్తుతం మార్వాడి యువ మంచ్ సహాకారంతో రాజస్థాన్ నుంచి వచ్చిన నిపుణులు కృత్రిమ కాళ్లు, చేతులు ఉచితంగా దివ్యాంగులకు అమరుస్తున్నారు. ఈ శిబిరానికి ప్రభుత్వ సహకారం అందించిందన్నారు. గత మూడు రోజులుగా ఈ శిబిరానికి అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి వందలాది దివ్యాంగుల వచ్చి ఉచితంగా కృత్రిమ అవయవాలతో ఆనందంగా తిరిగి వెళ్తున్నారని ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పలువురు బాల దివ్యాంగుల కష్టసుఖాలను తెలుసుకున్నారు.