
యువకుడి దారుణ హత్య
భువనేశ్వర్: కొబ్బరి బొండాల వివాదం పూరీ ప్రాంతంలో ఒక వ్యక్తి ప్రాణాల్ని బలిగొంది. ఈ వివాదంతో మొషాణీ చండీ గుడి దగ్గర బీభత్సమైన హత్యాకాండ చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి కున్నా బెహరా అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కక్షదారులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యువకుడు చనిపోయాడు. ఈ సంఘటనపై లిపున్ భోయ్, కొంత మంది సహచరులపై ఫిర్యాదు నమోదైంది. కొబ్బరి బొండాల కోత కారణంగా హత్య జరిగిందనే ఆరోపణ బలంగా వ్యాపించింది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక బసేలి సాహి ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు.