
ఓఎస్‌ఆర్‌టీసీలో కొత్త ఏసీ బస్సులు
జయపురం: జయపురం ఓఎస్‌ఆర్టీసీ డిపోలో పాత బస్సులు పక్కన పెట్టి ఆయా రూట్లలో కొత్త ఎయిర్‌కండిషన్ లక్ష్మీ బస్సులు ప్రవేశ పెట్టారు. ఆయా రూట్లలో 10 ఎయిర్‌కండిషన్ బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులకు తక్కువ చార్జీలతో ఎయిర్ కండిషన్ బస్సులు ప్రవేశ పెట్టిన విషయం విదితమే. అయితే ప్రైవేట్ బస్సుల యజమానుల రూట్ల విషయం, టైమింగ్‌లపై అభ్యంతరం తెలపటంతో కొద్ది నెలల కిందట అవి నిలిచిపోయాయి. లక్ష్మీ ఎయిర్‌కండిషన్ బస్సులు నడిపేందుకు అనుమతి లభించటంతో నేటి నుంచి జయపురం–కాశీపూర్, జయపురం– కొటాగాం, జయపురం–పర్లాకిమిడి, జయపురం–గుణుపూర్, జయపురం–కొటియ, జయపురం– మల్కనగిరి, భవానీపట్న – మోటు వయా జయపురం, ఇంధ్రావతి జానభాయి వయా జయపురం రూట్లలో కొత్త బస్సులు ప్రారంభించారు. అందుకు ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాత బస్సులలో కిలోమీటర్ కు 92 పైసలు చార్జీ ఉండగా కొత్తగా వేసిన లక్ష్మీ ఎయిర్ కండిషన్ బస్సులకు కిలోమీటర్‌కు కేవలం 55 పైసలు కావటంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఓఎస్‌ఆర్‌టీసీలో కొత్త ఏసీ బస్సులు