
నేతాజీ ధైర్యం అజేయం: గవర్నర్
భువనేశ్వర్: నేతాజీ ధైర్యం అజేయమని, అఖండ భారత దేశం కోసం దృఢమైన సంకల్పంతో భారత జాతీయ సైన్యం నాయకత్వం, స్వేచ్ఛాయుతమైన, లోతైన జాతీయ నైతిక విలువల్ని నిక్షిప్తం చేసుకుందని రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి కొనియాడారు. గురువారం కటక్ నగరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మస్థలాన్ని ఆయన సందర్శించారు. భారత దేశపు వర పుత్రుల్లో ప్రముఖునిగా నేతాజీ సుభాష్ చంద్రబోసు జీవన సాఫల్యం నిత్యం చైతన్య జ్యోతిగా ప్రజ్వలిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన నేతాజీ జన్మ స్థల భవన సముదాయం వెలుపల, లోపల ఉన్న విగ్రహం, ఫొటో పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

నేతాజీ ధైర్యం అజేయం: గవర్నర్

నేతాజీ ధైర్యం అజేయం: గవర్నర్