
‘వందే భారత్ నడపాలి’
జయపురం: వందేభారత్ రైలును కొరాపుట్ వరకు నడిపించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఒడిశా ముఖ్యమంత్రి మోహణ మాఝిలకు లేఖలు రాశారు. భువనేశ్వర్–విశాఖపట్నం–అరుకు–కొరాపుట్ దూరం 669 కిలోమీటర్లేనని, అందుకే భువనేశ్వర్–విశాఖపట్నం వందే భారత్ రైలును విశాఖపట్నం నుంచి అరుకు మీదుగా కొరాపుట్ వరకు నడపాలని డిమాండ్ చేశారు. భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వరకు నడిచే వందే భారత్ రైలు కేవలం 444 కిలోమీటర్ల దూరం లోగల విశాఖపట్నం కేవలం 5 గంటలలో చేరుతుందని, మరో 225 కిలోమీటర్లు పొడిగిస్తే మరో 4 గంటల్లో కొరాపుట్ చేరి తిరిగి 9 గంటలలో భువనేశ్వర్ చేరుతుందని వివరించారు. అందువల్ల కొరాపుట్ జిల్లాలో నందపూర్, లమతాపుట్ మొదలగు ఆదివాసీ ప్రాంతాల ప్రజలకు నేరుగా భువనేశ్వర్ వెళ్లే సదుపాయం కలుగుతుందన్నారు.