విశాల్‌ మెగా మార్ట్‌కు రూ. లక్ష జరిమానా | - | Sakshi
Sakshi News home page

విశాల్‌ మెగా మార్ట్‌కు రూ. లక్ష జరిమానా

May 20 2025 1:01 AM | Updated on May 20 2025 1:01 AM

విశాల

విశాల్‌ మెగా మార్ట్‌కు రూ. లక్ష జరిమానా

రాయగడ: స్థానిక ఎఫ్‌సీఐ సమీపంలోని విశాల్‌ మేగా మార్ట్‌ షోరూంలో సోమవారం ఫుడ్‌ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ జ్యోతి ప్రకాష్‌ సోరేన్‌ నేతృత్వంలో ఆ శాఖకు చెందిన మరో ఇద్దరు అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. వస్తువుల కాలవ్యవధి పూర్తయినప్పటికీ వాటిని విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఒక లక్ష రూపాయలను జరిమానాగా విధించారు. వివరాల ప్రకారం.. సంగ్రామ్‌ పట్నాయక్‌ అనే వినియోగదారుడు ఈ నెల 14వ తేదీన విశాల్‌ మేగా మార్ట్‌లో 1463 రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేశాడు. ఇందులో భుజియ (మిక్చర్‌)ప్యాకట్‌ కాల వ్యవధి పూర్తయినట్టు గుర్తించి విషయాన్ని వెంటనే మేగా మార్ట్‌ మేనేజర్‌ దృష్టికి తీసుకువెళ్లాడు. అయితే ఈ వస్తువు తమ వద్ద లేదని.. కాలవ్యవధి పూర్తయిన వస్తువులు తమ మార్ట్‌లో విక్రయించడం లేదని దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో పట్నాయక్‌ స్థానిక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఈ మేరకు తనిఖీలు నిర్వహించి మేగా మార్ట్‌ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ జరిమానా విధించారు. తనిఖీలు నిర్వహించిన సమయంలో కొన్ని కాలపరిమితి అయిన వస్తువులను సీజ్‌ చేసిన అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు.

విశాల్‌ మెగా మార్ట్‌కు రూ. లక్ష జరిమానా 1
1/1

విశాల్‌ మెగా మార్ట్‌కు రూ. లక్ష జరిమానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement