
భువనేశ్వర్‌లో త్వరలో ఎన్‌ఐఏ శాఖ ఏర్పాటు
భువనేశ్వర్: ప్రతిష్టాత్మక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శాఖను త్వరలో ఒడిశాలో ఏర్పా టు చేయనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత స్థానిక వీఎస్‌ఎస్ నగర్‌లో ఈ శాఖ కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. పోలీసు సూపరింటెండెంటు హోదాతో సమానమైన స్థాయి అధికారిని ఈ శాఖ అధిపతిగా నియమిస్తారు. ఎన్‌ఐఏ శాఖ ఒడిశాలో నేర, ఉగ్రవాద కార్యకలాపాలను త్వరగా దర్యాప్తు చేయడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్, గౌహాతి, కొచ్చి, లక్నో, ముంబై, కోల్‌కతా, రాయ్‌పూర్, జమ్మూ, చండీగఢ్, రాంచీ, చైన్నె, ఇంఫాల్, బెంగళూరు, పాట్నాలలో జాతీయ దర్యాప్తు సంస్థ 15 శాఖలను కలిగి ఉంది.
పింక్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు
భువనేశ్వర్: మహిళా యాత్రికులు, భక్తుల భద్రత, రక్ష ణ, మద్దతు, ఆపద సమయంలో పోలీసులు ఆసరాగా నిలిచేందుకు పింక్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. శ్రీ జగన్నాథ ఆలయం ఉత్తర ద్వారం వద్ద ఈ కేంద్రం పని చేస్తుంది. పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు ఈ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.