
విద్యార్థుల కోసం కొత్త ఒప్పందం: మంత్రి
భువనేశ్వర్: రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ, భారత జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ మధ్య గురువారం అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. ఈ నేపథ్యంలో ఇర పక్షాలు అనుబంధ దస్తావేజులపై సంతకాలు చేసి అంగీకారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి సూర్యవంశీ సూరజ్ అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ల సమక్షంలో సమక్షంలో విభాగం మండల కమిషనర్, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అరవింద్ అగర్వాల్, భారత జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు, ఒప్పంద పత్రంపై సంతకాలు చేసి అవగాహన కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో వివిధ కళాశాలల అధ్యక్షులు, విద్యార్థులు వర్చువల్ చానెళ్ల ద్వారా హాజరయ్యారు. ఈ అవగాహన ఒప్పందంపై (ఎంఓయూ) సంతకం చేయడం వల్ల రాష్ట్రంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించి ఆర్థిక అక్షరాస్యత మెరుగదల సాధ్యమవుతుంది. దీనితో పాటు, విద్యార్థులు భవిష్యత్‌లో వివిధ ఉపాధి అవకాశాలను కూడా పొందగలుగుతారు.
ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు రెండు రకాల కోర్సులు అందుబాటులోకి వస్తాయని మంత్రి ప్రకటించారు. ఇవి విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే కాకుండా వారి ఆర్థిక అక్షరాస్యతను పెంపొందిస్తాయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీని వల్ల విద్యార్థులు భవిష్యత్‌లో ఆర్థిక రంగంలో వివిధ ఉపాధి అవకాశాలను పొందేందుకు వీలు కలుగుతుంది. ఆర్ట్సు, సైన్స్, కామర్స్, వివిధ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కొత్త కోర్సులు కలిసి వస్తాయి. ఈ కోర్సులు విద్యార్థులకు సంప్రదాయ కెరీర్‌లను కొనసాగించడానికి అవకాశాలను అందించడమే కాకుండా, కొత్త కెరీర్ ప్రణాళిక, ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెస్తుందని మంత్రి వివరించారు. గురువారం జరిగిన భారత జాతీయ స్టాక్ ఎక్స్చేంతో కుదిరిన అవగాహన ఒప్పందం రాబోయే రోజుల్లో విద్యార్థులకు అనేక ఉపాధి అవకాశాలను అందిస్తుంది. అదనంగా జాతీయ విద్యా విధానం – 2020 ఆధారంగా విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధిని నిర్ధారించడం ద్వారా రాష్ట్రంలో విద్యా రంగం సమగ్ర అభివృద్ధిని సాధించవచ్చని ఉన్నత విద్యా మంత్రి సూర్యవంశీ సూరజ్ అభిప్రాయపడ్డారు.