
ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం
పర్లాకిమిడి: పర్లాకిమిడి పట్టణంలో సోమవారం ఉదయం 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు చవిచూసిన ప్రజలు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉరుములు, గాలులతో చిన్నపాటి వర్షం కురిసింది.అగ్నికార్తెలు వల్ల పర్లాకిమిడి పరిసర ప్రాంతంలో ఉదయం నిప్పులు వంటి ఎండ కాస్తున్నది. ఉదయం భగభగ మండే ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, సాయంత్రం కొద్ది పాటి వర్షంతో ఉపశమనం పొదారు.
క్రికెట్ టోర్నమెంట్ విజేత కేవిడి టీమ్
జయపురం: జయపురం సబ్ డివిజన్ కుంద్ర సమితి ఆసన పంచాయతీ చంజరాగుడలో నిర్వహించిన జయ మా క్రికెట్ టోర్నమెంట్ విజేతగా జయపురం సమితి కేవిడి గ్రామ టీమ్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో కేవిడి టీమ్, జబాకావిడి టీమ్‌లు తలపడ్డాయి. టాస్ గెలిచిన జబాకావిడి జట్టు మొదట బ్యాటింగ్ చేసి 16 ఓవర్లలో 64 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 65 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కెవిడి టీమ్ 10.3 ఓవర్లలో ఛేదించి విజేతగా నిలిచింది. విజేతలకు మాజీ మంత్రి పద్మిణీ దియాన్ చేతులమీదుగా ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో బ్లాక్ బీజేడీ బీజేడీ అధ్యక్షుడు బృంధావన మల్లిక్, సర్పంచ్ జయంతి కుసపొరియ, సమితి సభ్యుడు గోరీ హరిజన్ తదితరులు పాల్గొన్నారు.
వందే భారత్ రైలు నడపాలి
జయపురం: భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వరకు నడుపుతున్న వందే భారత్ రైలుని కొరాపుట్, జయపూర్‌ల మీదుగా ఛత్తీష్‌గడ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్ వరకు నడపాలని రాష్ట్ర బీజేడీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రబినారాయణ నందో కోరారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జగదల్‌పూర్, జయపురం, కొరాపుట్, విశాఖపట్నంల మీదుగా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపితే నవరంగపూర్, మల్కన్‌గిరి, కొరాపుట్ జిల్లాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఆయనతో పాటు బీజేడీ సీనియర్ నేత బాలా రాయ్, జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు బి.బాలంకిరావు, జయపురం బ్లాక్ బీజేడీ మాజీ అధ్యక్షుడు శివ పట్నాయక్‌లు ఉన్నారు.
వైద్య సేవకులకు నైటింగేల్ ఆదర్శనీయం
జయపురం: ఎంతోమంది వైద్య సేవకులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆదర్శనీయురాలని సామాజిక కార్యకర్త ప్రకాశ మహానందియ అన్నారు. స్థానిక ఫ్లోరెన్స్ నైటింగేల్ ఏఎన్‌ఎం నర్సింగ్ శిక్షణా కేంద్రంలో అంతర్జాతీయ నర్సుల సేవా దినోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ భొత్ర మాట్లాడుతూ.. క్షతగాత్రులు, రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలనుకునే నర్సులు నైటింగేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నర్సు వృత్తి ఎంతో పవిత్రమైనది పేర్కొన్నారు. కార్యక్రమంలో జ్యోతిర్మయి, వణిత నాయిక్, శాంతి భొత్ర, పాయల్ నాయిక్, అంచల బెహర, అభిమన్య బెనియ తదితరులు పాల్గొన్నారు.

ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం

ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం

ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం