ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి
మల్కన్‌గిరి: ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలు అప్రమ్తంగా ఉండాలని అధికారులు అన్నారు. మల్కన్‌గిరిలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పాటెల్ అధ్యక్షతన శనివారం జిల్లా స్థాయి ప్రకృతి విపత్తుల నిర్వహణ కమిటీ సమావేశంల జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలంలో నీటి ముంపు ప్రాంతాల ప్రజలకు 24/7 సేవలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమును ఏర్పాటు చేయాలన్నారు. జనరేటర్లు, మంచినీరు, ఆహారం, అత్యవసర ఔషధాలు, పాము, కుక్కకాటు మందులపై అధికారులు చర్చించారు. ముంపు ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణ, అగ్నిమాపక శాఖ ద్వారా నీటి పంపింగ్, విద్యుత్ సరఫరాపై సమావేశంలో చర్చించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ అన్నారు. సమావేశంలో నవరంగ్‌పూర్ ఎంపీ బోలాభద్ర మాఝి, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి , జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సమారీ టాంగులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గోవిందపాత్రో, మల్కన్‌గిరి మాజీ ఎమ్మెల్యే మనాస్ మడ్కమి, ఆదివాదీ సమాజ మహాసంఘ అధ్యక్షుడు బంధు ముదులీ, ఘనశ్యాం మడ్కమి పాల్గొన్నారు.


