
ముగిసిన వెలుపలి చందన యాత్ర
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని చందన యాత్ర తొలి విడత మంగళవారంతో ముగిసింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని ఆరంభమైన ఈ యాత్ర నిరవధికంగా 42 రోజులు కొనసాగుతుంది. తొలి 21 రోజులు వెలుపలి చందన యాత్రగా శ్రీ మందిరం నుంచి స్వల్ప దూరంలో నరేంద్ర సరోవరంలో అత్యంత ఆనందోత్సాహాలతో కొనసాగింది. శ్రీ మందిరం నుంచి నరేంద్ర సరోవరం వరకు దారి పొడవునా భక్తులు పలు రీతుల్లో భక్తి భావాల్ని చాటుకున్నారు. కళాకారులు శాసీ్త్రయ నృత్య, సంగీత గీతాలాపన తదితర కార్యక్రమాలతో దేవుళ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
నిత్యం సంధ్య వేళలో పల్లకిలో ఉత్సవ మూర్తులు సరోవరం నడి బొడ్డున ఉన్న చందన వేదికకు చేరు కుని శోభాయమానమైన అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించి నౌకా విహారంతో భక్తుల్ని మురిపించారు. 20వ రోజున అత్యధికంగా 21 సార్లు సరోవరంలో చుట్టు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. చివరి రోజు సంధ్య వేళలో నౌకా విహారం లేకుండా చందన వేదికపై దేవదేవుళ్లు పసుపు పొడి కలిపిన నీటితో ఉత్సాహభరితంగా చందన యాత్రలో పాల్గొన్నారు. వెలుపలి చందన యాత్ర 21వ రోజున శ్రీరామకృష్ణ, మదన మోహన్‌లు పసుపు నీరు పిచికారీ చేసుకుని ఆహ్లాదభరితంగా చందన యాత్రకు తెరదించారు. నేటి నుంచి లోపలి చందన యాత్ర ఆరంభం అవుతుంది. 21 రోజుల పాటు నిరవధికంగా శ్రీ మందిరం లోపలి ప్రాకారంలో చందన యాత్ర కొనసాగుతుంది.
న్యూస్‌రీల్

ముగిసిన వెలుపలి చందన యాత్ర

ముగిసిన వెలుపలి చందన యాత్ర

ముగిసిన వెలుపలి చందన యాత్ర

ముగిసిన వెలుపలి చందన యాత్ర

ముగిసిన వెలుపలి చందన యాత్ర