
ఉత్కళ కరాటే స్కూల్‌కు పతకాల పంట
జయపురం: భువనేశ్వర్‌లో ఈ నెల తొమ్మిది నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో కొరాపుట్ జిల్లా సెమిలిగుడ ఉత్కళ కరాటే స్కూల్ విద్యార్థులు పతకాల పంట పండించారు. ఆ స్కూల్‌కు 19 పతకాలు లభించాయి. వాటిలో ఐదు బంగారు, తొమ్మిది వెండి, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయని పాఠశాల ప్రతినిధుల వెల్లడించారు. రుద్రాంశ కుమార్ శామల్ రెండు బంగారు, ఆకాంశ్య ప్రధాన్, దీప్తి నామదేవ్, తపశ్విణీ నాయిక్‌లు చేరో ఒక బంగారు పతకాలు సాధించారు. ఏంజిల్ అభిశిక్త మినియాక, శిబప్రతి చందన నాయిక్, నందినీ నాయిక్, తృప్తి రాణీ మహంతి, శుభమ్ నాయిక్, తపశ్విణీ, శృతి శిఖా సాహు, తృప్తి సంపూర్ణ దాస్ వెండి, అంకిత ఖొర,విద్యాశ్రీ నివేదిత మల్లిక్,శృతి, ఆకాంశ్య పటి, సంపూర్ణ కాంస్య పతకాలు సాధించారన్నారు. కొరాపుట్ జిల్లా కరాటే అసోసియేషన్, సెమిలిగుడ కరాటే స్కూలు నిర్వాహకులు, కరాటే అభిమానులు విజేతలకు అభినందించారు.