
బైక్ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి బలిమెల–మల్కన్‌గిరి ప్రధాన రహదారి ఖిల్‌గూఢ గ్రామం కూడలి వద్ద గురువారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. డుడుమేట్ల పంచాయతీ డంగాగూఢ గ్రామానికి చెందిన పరదేశీ హల్వా, భీమ హల్వా ఒక బైక్‌పై వస్తున్నారు. నూవగూఢ గ్రామానికి చెందిన సంభారు మాడీ బైక్‌పై నుంచి పడిపోయారు. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి క్షతగాత్రులను కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి మేరుగైన వైద్యం కోసం మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోరుకొండ ఏఎస్‌ఐ ప్రదీప్ కుమార్ ఖీలో ఇతర సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

బైక్ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు