
వారెంట్లు, సమన్ల అమలుపై దృష్టి: ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : కేసులో కోర్టువారు జారీ చేసిన నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు, సమన్ల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సమన్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రతి పీఎస్‌లో ప్రోసెస్ రిజిస్టర్ నిర్వహణ సక్రమంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, చిరునామా, ఇతర ఆధారాలు, సాంకేతికతను అనుసరించి ఎన్బీడబ్ల్యూదారులను గుర్తించి కోర్టులో హాజరుపర్చాలన్నారు. ముఖ్యంగా సంఖ్య తగ్గేలా చూ డాలన్నారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ కె.విరమణ, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసరావు, సైబర్ సెల్ సీఐ శ్రీను, ఎస్‌ఐ నేతాజీ పాల్గొన్నారు.