
రాణిగుడఫారంలో చోరీ
రాయగడ: స్థానిక రాణిగుడఫారం డీఎఫ్‌ఓ రెండో కాలనీలో నివసిస్తున్న బసంత కుమార్ స్వయి ఇంట్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంటి తలుపులు వేసి ఉండటాన్ని గమనించిన గుర్తు తెలియని దుండగులు తాళాలను విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 12 తులాల వెండి పట్టీలు, 60 వేల రూపాయల నగదును దొంగిలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సైంటిఫిక్ బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బసంత కుమార్ స్వయి డీఎఫ్‌వో రెండో కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. వారం రోజుల క్రితం కుటుంబంతో కలిసి పనిమీద కటక్ వెళ్లాడు. ఆదివారం తెల్లవారున ఇంటి యజమాని గౌరి శంకర్ పాత్రో ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. అనంతరం చొరీ జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.

రాణిగుడఫారంలో చోరీ