
కాశీపూర్‌లో వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని కాశీపూర్‌లో గల సమితి కార్యాలయం సమావేశం హాల్‌లో మంగళవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఫరూల్ పట్వారీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 43 వినతులను స్వీకరించారు. ఇందులో 32 వ్యక్తిగత సమస్యలు కాగా, 11 గ్రామ సమస్యలుగా గుర్తించారు. స్వీకరించిన వినతులను త్వరిత గతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ పట్వారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రకాంత్ మాఝి, జిల్లా అదనపు ముఖ్య వైద్యాధికారి డాక్టర్ మమత సాహు తదితరులు పాల్గొన్నారు.