
భారీ మొత్తంలో కలప పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా అటవీ శాఖ వారు కోరుకొండ సమితి ఎంవీ 41 గ్రామానికి చేందిన ధనుర్జయ్ ఢాలీ, పాలకొండ గ్రామానికి చెందిన గంగా మాడీలు కలప తరలిస్తుండగా పట్టుకున్నారు. మల్కన్‌గిరి అటవీ శాఖ రేంజర్ రమేష్ చంధ్ర రౌత్ నేతృత్వంలో, సరోజ్ స్వాయి, స్క్వాడ్ సిబ్బంది కూంబింగ్ పనులు మొదలుపెట్టారు. సోమవారం రాత్రి నిందితులు రెండు ట్రాక్టర్లలో లోడ్ చేసిన కర్రలను తరలిస్తున్నారు. అటవీ శాఖ ఆపి తనిఖీ చేయగా సరైన పత్రాలు చూపలేకపోయారు. దీంతో కర్రలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.